పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరదరాజు రామాయణమున కొన్ని పట్టుల వాల్మీకము నందు లేని కథలుకూడ నున్నవి. అందొకటి. ఇంద్రజిత్తు నాగ పాశముల చే బంధించిన పుడు సోరదుఁ డే తెంచి రాముని స్తుతి యించి నీ వాహనమైన గరుడుని స్మరించినయెడల నాతఁడిచటికి చను దెంచిన మాత్రన సోగా ప్రబంధము తొలఁగునని యుప దే శించి: ట్రీ రామాయణమున నున్నది. ఇది వాల్మీకమున లేదు. కాని రంగ నాథ భాస్కర రామాయణములం దున్నది. మూల మున లేకున్నను వైష్ణవ ప్రప త్తివలన నరదరాజు దీనిని చేర్చి యుండవచ్చును,

| వాల్మీకమున ప్రక్షిప్తములైన యీ క్రింది కథాంశములు భాస్కర రంగనాథ రామాయణములలో గానవచ్చు చున్నవి.

లక్మణుఁడు రావణుని శ క్తిచే నిహతుఁడై మూర్చనొంది యుండ సు మేణు నాజ్ఞచే సంజీవిపర్వత ముఁ దెచ్చుటకుఁబోయిన హనుమంతుఁడు మార్గమధ్యమునందు మాయామునియైన కాల నేమి యాశ్రమమును బోడఁగాంచుట, ఆ యాశ్రమము నందున్న సరస్సులో శాపముచే మొసలియై పడియున్న ధాన్యమాలిని జంపీ శాపమోక్షమొనర్చట మొదలగు కథాంశములును మున్నగు విషయములు,

శుక్రాచార్యోపదేశము చే రావణుఁడు పాతాళహోమ మొనర్చుట-ఇవి వరదరాజు రామాయణమున లేవు.

రావణవధ సమయమున రామునికి విభీషణుడు చేసిన యువ దేశము వాల్మీకమునందు లేదు. ఈ యంశ మథ్యాత్మ రామా యణమునుండి గ్రహింపబడినది. భాస్కర రంగ నాథ రామా యణములందిది గలదు.