పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18


మైనవి కావున మూఁడవగ్రంథమగు నన్నమయ్య కృతి తాళపత్ర గ్రంథముల నా మూలాగ్రముగ పరిశోధించిన మనకు లభింప గలదని చెప్పనొప్పును. వాఙ్మయ పరిశోధకు లట్టిపనికిఁ గడంగినచో నేటి రంగనాథ రామాయణమును గూర్చిన పెక్కు సమస్యలు, చిక్కులు విడిపోవుననియు గ్రంథము నిజస్వరూపము, విశిష్టత తేటపడఁగలదని నాయొక్క దృఢమగు నమ్మకము.

| ఈ యుద్ధకాండమండలి గచన కూడ తక్కిన కాండముల యందువలె జాతివార్తా చమత్కార విలసితమై, సంస్కృతాంధ్రపద సమబంధురమై వెలయుచున్నది. రచనారీతి యాది నుండి యంతమువఱకు నిమ్నో న్నతములుగా లేక నొకేరీతిని కమ్మచ్చులోని తీగ విధమున సాగినది. రంగనాథ రామాయణమున కథా కథనమే ప్రధానముగనున్నది. కాని వరదరాజు రామాయణమున కథా కథనమేకాక కమనీయ కవితారచన కూడ కలదు. రచనయందు రెండింటికిగల తారతమ్యమును గ్రహించుటకు సమానమగునొక ఘట్టము నుదాహరించు చున్నాను.

ఇంద్రజిత్తు ద్వితీయ యుద్దము

ద్వి.
ఆసమయంబున నాదానవుండు
భాసురంబుగఁ దనప్రభఁ గాననీక
యాదివినుండి దివ్యాస్త్రంబు లేయ
నాదానవుని దెస కగచరలెగసి
యగములు నైవంగ నవిద్రుంచి గుండె
లగలించి పెక్కండ్ర నవనిపైగూల్చి