పుట:Shaasana padya manjari (1937).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి.

29

తేజోబలారోగ్యధీ సమగ్రుం డైన
సయశాలి తిమ్మయ్య సంద్దనుండు.
విభవాస్పదం బైన వినికొండతూపు౯న
తనరు నిడుపులపాడు[1] తాసకంబ్బు
జలజలోచనుండు కేశవదేవుండు ...
వేల్పు వెలయ దిమ్మయ ప్రోలవిభుడు.[2]
(తక్కినది స్పష్టముగాఁ దెలియుట లేదు)

39.


శ. స1522


ఇది గుంటూరుజిల్లా ఒంగోలు తాలూ కాలోని ధర్మవరము గ్రామములో సీతారామ
స్వామియాలమున కెదుట నున్న యొక ఱాతి పైఁ జెక్టఁ బడినది- (A.R. 811 of 1922)

సీసము. వివిధ సేనలం(దూ)రి[3] పెద్ద గుంపులు సేసి
(పదిరిగా)ల్చినయట్టిపాలెగాండ్ల
దుగా౯ధిపుల బిరుదులు రణావనిం గొట్టి
పట్టింకొనినియెడుపాలెగాండ్ల
పూవా౯బ్ధిపర్యంతమును దాడి పెట్టిన
పడమటిగట్ల పాలెగాండ్ల
జలదుగ౯గిరిపనస్థలదుగ౯ భూముల
పట్టు గల్గినయట్టి పాలెగాండ్ల

...........................................................................................................................

  1. నిడ్పులపాడు- అని యుండనోపు .
  2. ఈ పాద మిట్లుండవలయును-
    జలజలోచనుండు కేశవ దేవుం డిలు వేల్పు
    వెలయ దిమ్మయప్రోలవిభుండు........
  3. గూర్చి-అని యుండవలయు నేమో?