Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

శాసనపద్యమంజరి.


మహితఘుమఘుమ ముమడిమొ మానినాడ[1]
మాత్రమునం బశ్చిమాంబుధి మహికి మిగులం
బరువు వెట్టించ్చి మహమందు పాదుశహప్ర
ధానవర్యుండు యెకలాసఖానవిభుడు.

ఇటువంటి యెకలాసఖానునింగారు అద్దంకిసీమలో ధర్మవరమునందు తనపేర యెకలాసఖానపుర మని పేట కట్టించి యీపేటకు కౌంలు ఇచ్చిన వివరం.

—————

40

శ. స. 1685

ఇది గంజాముమండలము శ్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వరస్వామియాలయము తిరుచుట్టుమండపములోని యిరువదిమూఁడవస్తంభము వాయవ్యమూల దక్షిణముఖముగా చెక్కఁబడియున్నది. (Sonth Indian Inscriptions Vol. V. No. 1203.)

స్వస్తిశ్రీ॥ శాలివాహనశకే గతాబ్దాః 1685 కాంగ్గా.


శ్లో.

శ్రీమత్కూర్మపురే సమస్తభువనఖ్యాతే మహాయత్నతః
శ్రీరామం నిజలక్ష్మణేన సహితం కర్త్తుం మహావైభవాత్
శ్రీరామానుజలక్ష్మణస్య సుతనో ర్భక్త్యా శు కూర్మాలయే
సర్వైశ్వర్యయుతే సమస్తశుభదే లోకైకనేత్రోత్సవే.

1


శ్లో.

శ్రీమద్భాష్యకులాబ్ధిసోమసుమహావేదాంతవర్య స్సదా
స్వాచార్యైకమనా స్సమస్తగుణయుక్ శ్రీమత్స్వభాన్వా(౦)హ్వయే
వర్షే మాసిచ జేష్ఠసంజ్ఞని నిజే చిత్తాఖ్యఋక్షే శుబే
శ్రీమత్పద్దశమీదినే శుభకరే వారేచ సోమస్యవై.

2


శ్లో.

సర్వోత్కృష్ట మపూర్వవస్తునిచయైః కృత్వా ప్రతిష్ఠాం శుభాం
తత్పూజాది మహోత్సవం సమతనో త్కీర్తివృద్ద్యై సదా.

  1. దీనియర్ధము స్పష్టముగా లేదు.