| |
పట్టుచీరయుం బళ్ళెంబు భక్తి నొసగెం[1]
దనద్దు[2]ధర్మంబు లాచంద్రతారక(ము)గా.
|
|
38
ఈపద్యము గుంటూరుజిల్లా బాపట్లతాలూకాలోని ఇడుపులపాడుగ్రామములోని చెన్నకేశ్వరస్వామిదేవాలయములో గరుడస్తంభముపై నాల్గువైపులను చెక్కఁబడియున్న యొకసంస్కృతశాసనమునం దిమిడియున్నది. (A. R. 802 of 1922)
| సీ. |
శ్రీయాజ్ఞవల్క్యప్రసిద్ధాన్వయమునందు
ముఖ్యుండు దామయ్య ముత్తతాత
గురుభరద్వాజసద్గోత్రోద్భవుం డైన
ధన్యుం డనంతయ్య తాతతాత
నిత్యసత్య ... ...వి మానాఖ్యుం ....
ముత్తనాయ ... తండ్రితాత
భూరివైభవ ...గర్బ్భుం డీతం డనంగం
దనరు కొండయమంత్రి తండ్రితండ్రి
మహిమతో దుర్మ్మంత్రిమానమర్ద్దనుం డైన
ఘనుండు ముత్తయమంత్రి కన్నతండ్రి
పరమపాతివ్రత్యభాగ్యసంపన్నయౌ
కమలాక్షి సింగాంబ కన్నతల్లి
అగ్రగణ్యులు కొండయామాత్యచంద్రుండు
రమ్యవైభవుండు శ్రీరంగవిభుండు
|
|
- ↑ "నొసంగెం" అని యుండవలెను.
- ↑ "దనదు" అని యుండవలెను.