| |
తేజోబలారోగ్యధీసమగ్రుం డైన
నయశాలి తిమ్మయ్య నంద్దనుండు
విభవాస్పదం బైన వినికొండతూర్పున
తనరు నిడుపులపాడు[1] తానకంబ్బు
జలజలోచనుండు కేశవదేవుండు ...
వేల్పు వెలయ దిమ్మయ ప్రోలవిభుండు.[2]
|
|
(తక్కినది స్పష్టముగాఁ దెలియుట లేదు).
39
ఇది గుంటూరుజిల్లా ఒంగోలుతాలూకాలోని ధర్మవరముగ్రామములో సీతారామస్వామియాలయమున కెదుట నున్న యొకఱాతిపైఁ జెక్కఁబడినది. (A.R. 841 of 1922)
| సీసము. |
వివిధసేనలం(దూ)రి[3] పెద్దగుంపులు సేసి
(పదిరిగా)ల్చినయట్టిపాలెగాండ్ల
దుర్గాధిపులబిరుదులు రణావనిం గొట్టి
పట్టించుకొనియెడుపాలెగాండ్ల
పూర్వాబ్ధిపర్యంతమును దాడి పెట్టిన
పడమటిగట్ల పాలెగాండ్ల
జలదుర్గగిరివనస్థలదుర్గభూముల
పట్టు గల్గినయట్టి పాలెగాండ్ల
|
|
- ↑ "నిడ్పులపాడు" అని యుండనోపు.
- ↑ ఈపాద మిట్లుండవలయును.
జలజలోచనుండు కేశవదేవుం డిలువేల్పు
వెలయ దిమ్మయప్రోలవిభుండు........
- ↑ "గూర్చి" అని యుండవలయునేమో?