పుట:Rangun Rowdy Drama.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము.

49

     ఉత్తమాంగనల కయుక్తంబులైన రం
                 డీలగల్లీలలో నెమకినాను

గీ. నిర్గమింపరాని మార్గముల్ నైటుబ
    జార్లు బార్లు నాంధ్రసంఘములను
    రంగమెల్ల వెదకి రాజసరోవర
    ఘట్టములనుఁ గంటి తుట్టతుదకు.

మోహ - అమ్మా! ! ఈదినమున మనకు నాన్నగారు కనఁబడుదురని చెప్పితివే ! ఎక్కడ నున్నారో చెప్పవే ! బతిమాలి నే నింటికి దీసికొని వచ్చెదనే.

అన్న - నాయనా ! విచారపడకు; మనము నాన్నగారికొఱకే యిక్క,డికి వచ్చితిమి ! ఇప్పుడే కనఁబడెదరు.

మోహ - అమ్మా ! నాకు నిద్రవచ్చుచున్నదే !

అన్న - అయ్యో ! నే నేమిచేయుదునురాతండ్రీ ! ఈకటికనేలపైననే పరుండెదవా! నా పైఁటకొంగుచే నీ వృక్షచ్ఛాయను శుభ్రపరచి పరచెదను. పరుండుము నాయనా ! (అట్లుచేసి పరుండఁబెట్టి) అక్కటా ! ఎట్టి యైశ్వర్యవంతునిబిడ్డని కెట్టిపాటు గలిగెను ?

సీ. మృదుతల్పములయందు నిదురించు సుకుమారి
                   కఱకురానేలల గడుపవలసె
    వెలలేని భోజ్యముల్ వెక్కసం బగుబిడ్డ
                  యాఁకటిదప్పుల కడలవలసె
    అడు గావలకు నిడ నడలుజెందెడుకూన
                  పరదేశములలోనఁ దిరుగవలసె
    లాలితామూల్యచేలములు గట్టెడుకూన
                  కడుజీర్ణచేలముల్ గట్టవలసె
    బంధుజనుల చంకఁబాయని మోహనుం
    డకట ! తండ్రిజాడ లరయవలసె