చతుర్థాంకము.
49
ఉత్తమాంగనల కయుక్తంబులైన రం
డీలగల్లీలలో నెమకినాను
గీ. నిర్గమింపరాని మార్గముల్ నైటుబ
జార్లు బార్లు నాంధ్రసంఘములను
రంగమెల్ల వెదకి రాజసరోవర
ఘట్టములనుఁ గంటి తుట్టతుదకు.
మోహ - అమ్మా! ! ఈదినమున మనకు నాన్నగారు కనఁబడుదురని చెప్పితివే ! ఎక్కడ నున్నారో చెప్పవే ! బతిమాలి నే నింటికి దీసికొని వచ్చెదనే.
అన్న - నాయనా ! విచారపడకు; మనము నాన్నగారికొఱకే యిక్క,డికి వచ్చితిమి ! ఇప్పుడే కనఁబడెదరు.
మోహ - అమ్మా ! నాకు నిద్రవచ్చుచున్నదే !
అన్న - అయ్యో ! నే నేమిచేయుదునురాతండ్రీ ! ఈకటికనేలపైననే పరుండెదవా! నా పైఁటకొంగుచే నీ వృక్షచ్ఛాయను శుభ్రపరచి పరచెదను. పరుండుము నాయనా ! (అట్లుచేసి పరుండఁబెట్టి) అక్కటా ! ఎట్టి యైశ్వర్యవంతునిబిడ్డని కెట్టిపాటు గలిగెను ?
సీ. మృదుతల్పములయందు నిదురించు సుకుమారి
కఱకురానేలల గడుపవలసె
వెలలేని భోజ్యముల్ వెక్కసం బగుబిడ్డ
యాఁకటిదప్పుల కడలవలసె
అడు గావలకు నిడ నడలుజెందెడుకూన
పరదేశములలోనఁ దిరుగవలసె
లాలితామూల్యచేలములు గట్టెడుకూన
కడుజీర్ణచేలముల్ గట్టవలసె
బంధుజనుల చంకఁబాయని మోహనుం
డకట ! తండ్రిజాడ లరయవలసె