పుట:Rangun Rowdy Drama.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

రంగూన్‌రౌడీ.

    ఇట్టిపాటుఁ గాంచి యీ మొండిప్రాణ మేఁ
    దాల్పవలసె ! మేను నిల్పవలసె !!

(మోటారుబండి ధ్వని వినఁబడును.)

అన్న - ఎవరో విహారాసక్తులు కాఁబోలును మోటారుబండిపై నీవంక కే వచ్చుచున్నారు. (అవకుంఠనమును సవరించుకొనును.)

[శంకరరావు - ప్రభావతితో మోటారుబండిమీఁద ప్రవేశము]

శంక - (బండిని నిలిపి) ప్రభావతీ ! ఈప్రదేశము యోగ్యమై యున్నది కొంతతడ విచ్చట విశ్రాంతిఁ దీర్చుకొందము.

ప్రభా - మీయభిప్రాయప్రకారమే !

(ఇద్దఱును సుఖాసీను లగుదురు.)

అన్న — (భర్తనుఁ జూచి ఆశ్చర్యవిషాదములతో) ఏమీయద్భుతము ! నేను కలఁగనుచుండుటలేదు గదా! ఈవ్యక్తి నాహృదయాధి నాథుఁడే యగునా ? నాకన్ను లేమైన నన్ను భ్రమింపఁజేయు చున్నవా? కాదు; కాదు. ఆశ్చర్యములేదు. సంశయము లేదు. ఈతఁడు తప్పక నామనోనాథుఁడే! ఓభగవానుఁడా! ఏమి నీలీలల పరమాద్భుతరహస్యము ! ఎన్నినాళ్ళకీజీవచ్ఛవమునకు పునశ్చతన్యమును గలిగించితివి ? ఆశ్చర్యకరమగు నీవిధానము నేమని పొగడుదును?

సీ. అపరాధులైనట్టి హంతకులకుఁ గల్గు
                నట్టి భీతిముఖమునందు లేదు
    దేశసంచారియౌ దోషంబునం గల్గు
                కల్మషాంబరములు గానరావు
    జన్మస్థలంబును జాయాసుతులఁ బాయు
                చింతయా హృదయానఁ జేరరాదు