పుట:Rangun Rowdy Drama.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగూన్ రౌడీ

అను

పతిభక్తి.

చతుర్థాంకము.

రంగము-1.

స్థలము - రంగూన్ రాజసరోవరప్రాంతము.

[ప్రవేశము.--అన్నపూర్ణ, మోహనరావుతో.]

అన్న - కటకటా ! వలదు వల దని కృష్ణమూర్తియు, జానకియు నెంతచెప్పినను సముద్రమును సైత మతిక్రమించి, కుఱ్ఱవానితో రంగూను చేరుకొంటిని. వెంటఁగొనివచ్చిన స్వల్పధనమును వెచ్చించితిగాని, యిప్పటికిని నానాధునిజాడ యీ పురమునఁ గానరాదయ్యె. విశ్రాంతమైన యీమహాపట్టణమున, విభునియునికి నా కెట్లుతెలియును? పోలీసులభీతిచే నెందైన దాగియుండెనో, కాక బంధింపఁబడెనో, పలుకరాదు గాని, ప్రాణములనే వదలెనో ! దైవమా ! నా కెట్లు తెలియును ? ఈపట్టణమున నాకు దిక్కెవ్వరు? మ్రొక్కెవ్వరు ?

సీ. పావన శ్రీబుద్ధదేవాలయం బైన
                 పెద్దపయాగుడి వెదకినాను
    అసమాన విక్టోరియామహోద్యానంబు
                నంతయుఁ బూన్కిమై నరసినాను
    మధుసురారతులైన యధముల నెలవు ల
                శేషంబు వెదకింపఁ జేసినాను.