ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జాడ - జాతి 836 జాతి - జాద
జాడపడు
- ఎక్కువగా ఉన్నవి తక్కు వై పోవు, విరళ మగు.
- రూ. జాడలు పడు.
జాడించి తన్ను
- కాలుతో తీసి తన్ను.
జాడించి పలుకు
- గట్టిగా తిట్టు.
- "సామాన్య యోగుల జాడించి పలుక." ప్రభు. 3. 86.
జాడు పేడు
- తృణప్రాయం, దిగదుడుపు ప్రాయం, తాడుతోను చెక్కపేడుతోను సమాన మనుట.
- "....ధీజనస్తుత వచోవిభవంబు నశేష చక్రివా, దోడన సాటిగా నతనితోఁ బెఱమంత్రులు జాడు బే డనన్." శృం. శాకుం. 1. 6.
జాతకర్మ
- పుట్టినబిడ్డకు చేయు సంస్కారము.
జాతాశౌచం
- పురుడు.
- చూ. మృతాశౌచం.
జాతి...
- ఉత్తమ మైన, శ్రేష్ఠ మైన. మంచి జాతికి చెందిన అన్న అర్థంతో ఆరంభ మై, ఉత్తమ మైన అన్న విశేషణంగా నిలిచిన మాట.
- జాతివార్తా చమత్కారములు, జాతికుక్క, జాతిసరుకు, జాతి ముత్యాలు ఇత్యాదులు.
- చూ. జాతిగా.
జాతిగా
- అందముగా.
- "జాతిగాఁ దాల్చి నెఱ మిండజంగ మగుచు." హర. 5. 41.
- చూ. జాతి...
జాతినాగు
- మంచిజాతి సర్పము.
- "జాతినాగులఁ జంపుచుండి, ప్రతిమ నాగులకును బాల్వోసినట్టు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 202.
- బ్రతికి ఉన్న నాగులను వదలి, ఱాతి నాగులకు పాలు పోసినట్లు - వ్యర్థము.
జాతివార్తలు
- జాతీయములు.
- "జాతివార్తలు దొలఁక రసంబు గులుకఁ, గవిత రచియించుఁ గల్పించి కతలు నుడువు." శుక. 2. 14.
జాదరలు
- పెండ్లిండ్లలో తొలుత కుల పాలికాపూజ చేసి మూకుళ్లలో మొలక పోస్తారు. ఆ మొలకలు.
- "ఈశు నుద్వాహమున కమరేంద్ర దిగ్వి, లాసవతి పైఁడిపాళియఁ బోసి తెచ్చు, జాదరలొ నాఁగ రాగపూర్ణోదయేందు, బింబమునఁ బాండుకిరణాంకురంబు లెసఁగె." కుమా. 8. 112.