పుట:PadabhamdhaParijathamu.djvu/862

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాడ - జాతి 836 జాతి - జాద

జాడపడు

 • ఎక్కువగా ఉన్నవి తక్కు వై పోవు, విరళ మగు.
 • రూ. జాడలు పడు.

జాడించి తన్ను

 • కాలుతో తీసి తన్ను.

జాడించి పలుకు

 • గట్టిగా తిట్టు.
 • "సామాన్య యోగుల జాడించి పలుక." ప్రభు. 3. 86.

జాడు పేడు

 • తృణప్రాయం, దిగదుడుపు ప్రాయం, తాడుతోను చెక్కపేడుతోను సమాన మనుట.
 • "....ధీజనస్తుత వచోవిభవంబు నశేష చక్రివా, దోడన సాటిగా నతనితోఁ బెఱమంత్రులు జాడు బే డనన్." శృం. శాకుం. 1. 6.

జాతకర్మ

 • పుట్టినబిడ్డకు చేయు సంస్కారము.

జాతాశౌచం

 • పురుడు.
 • చూ. మృతాశౌచం.

జాతి...

 • ఉత్తమ మైన, శ్రేష్ఠ మైన. మంచి జాతికి చెందిన అన్న అర్థంతో ఆరంభ మై, ఉత్తమ మైన అన్న విశేషణంగా నిలిచిన మాట.
 • జాతివార్తా చమత్కారములు, జాతికుక్క, జాతిసరుకు, జాతి ముత్యాలు ఇత్యాదులు.
 • చూ. జాతిగా.

జాతిగా

 • అందముగా.
 • "జాతిగాఁ దాల్చి నెఱ మిండజంగ మగుచు." హర. 5. 41.
 • చూ. జాతి...

జాతినాగు

 • మంచిజాతి సర్పము.
 • "జాతినాగులఁ జంపుచుండి, ప్రతిమ నాగులకును బాల్వోసినట్టు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 202.
 • బ్రతికి ఉన్న నాగులను వదలి, ఱాతి నాగులకు పాలు పోసినట్లు - వ్యర్థము.

జాతివార్తలు

 • జాతీయములు.
 • "జాతివార్తలు దొలఁక రసంబు గులుకఁ, గవిత రచియించుఁ గల్పించి కతలు నుడువు." శుక. 2. 14.

జాదరలు

 • పెండ్లిండ్లలో తొలుత కుల పాలికాపూజ చేసి మూకుళ్లలో మొలక పోస్తారు. ఆ మొలకలు.
 • "ఈశు నుద్వాహమున కమరేంద్ర దిగ్వి, లాసవతి పైఁడిపాళియఁ బోసి తెచ్చు, జాదరలొ నాఁగ రాగపూర్ణోదయేందు, బింబమునఁ బాండుకిరణాంకురంబు లెసఁగె." కుమా. 8. 112.