పుట:PadabhamdhaParijathamu.djvu/861

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జవి - జాజ 835 జాజ - జాజు

జవిళిసరుకులు

 • జవిళి అంగడిలోని సరకులు. (జవిళి=గుడ్డలంగడి) అనగా అందుబాటులో నున్నవి.
 • "నవనిధానంబు లేదేవి జవిళిసరుకులు." పాండు. 1. 2.
 • రూ. జవళి...

జళుకులు వాఱ దంచు

 • మెఱుగుపోటు వేసి దంచు. ఒకసారి దంచి, దానిమీద దంచడాన్ని మెఱుగుపోటు అంటారు. పాండు. 3. 87.
 • చూ. మెఱుగుపోటు.

జాగఱ గట్టు

 • మేలుకొను, జాగారము చేయు.
 • "జాము పోయినదాఁక జాఁగఱ గట్టి, బాములఁ బొందుచు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1941.

జాగుపడు

 • సాగు. విజయ. 1. 43.

జాగుపెట్టు

 • జాగు సేయు.
 • "పెక్కు మాటల నిటు జాగుపెట్ట నేల." కాశీ. 2. 88.

జాగెనకత్తెర

 • మల్ల బంధవిశేషం.

జాజరకత్తె

 • మాయలాడి.

జాజరకాడు

 • మాయవాడు.

జాజాలపాలిక

 • అంకురార్పణం చేసే మూకుడు.

జాజాలపాలె

 • చూ. జాజాలపాలిక.

జాజు చేయు

 • ఎఱ్ఱవడ జేయు.
 • "బాగుగా జాజు చేసినఁ బ్రజ్వరిల్లు." రాధా. 5. 254.

జాజులు ప్రసాద మగు

 • అత్యనుకూల మగు, అత్యభిలషణీయ మగు.
 • జాజులే కాక ప్రసాదం కూడా అయినప్పుడు మఱింత వాంఛనీయం కదా.
 • "నీ కవితంబ నై నిర్దోష మగుచు, మాకు నంకితము రామాయణం బైన, బంగరు పువ్వుల పరిమళ మైపొ,సంగి జాజులును బ్రసాదమ్మునట్లు." వర. రా. బా. పు. 6. పంక్తి. 7.
 • చూ. జాదులు ప్రసాదము నగు.

జాజువాఱు

 • ఎఱ్ఱబాఱు.
 • "శశికాంతమణిపీఠి జాజు వాఱఁగఁ గాయ, లుత్తుంగకుచపాళి నత్తమిల్ల." మను. 2. 27.

జాజు సేయు

 • ఎఱ్ఱరంగు వేయు, ఎఱ్ఱవడ చేయు.
 • చూ. జాజు చేయు.