పుట:PadabhamdhaParijathamu.djvu/863

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాద - జాన 837 జాన - జాను

జాదరాడు

  • గందవొడి చల్లుకుంటూ క్రీడించు.

జాదుకొను

  • పరవశ మగు, భావాతిరేకముచే నుద్రిక్త మగు.
  • "సకలాంగకంబులు జాదుకోఁ బులకించి." నైష. 5. 9.
  • "అర్థి యనుపేరు చెవి సోఁకినంత మాత్ర, జాదుకోఁ బులకించె నజ్జన విభుండు." నైష. 3. 48.

జాదులు ప్రసాదము నగు

  • తనకు సహజంగానే యిష్టమయినది దైవప్రసాదము కూడా అయిన దనుట.
  • "సంతస మంది జాదులు ప్రసాదము నయ్యె నటంచుఁ బొంగి నా,గాంతకుఁ డంబుజోదర.." పారి. 2. 75.
  • "అనూన మైనచ,క్కందనమున్ సువర్తనముఁ గల్గినఁ బెన్మిటి కేమి చెప్ప ? నా, చందనగంధి జాదులు ప్రసాదము గాదె చకోరలోచనా!" కళా. 7. 95.
  • చూ. జాజులు...

జాదులు వేచు

  • అననురూప కార్యమున కగ్గము చేయు, సుకుమార మైనవానిని కఠినంగా శిక్షించు.
  • "సరవి యెఱుంగ లే కకట జాదులు వేఁచెను మంగలంబునన్." శృం. శాకుం. 2. 62.

జానకిత్రాడు

  • 1. నిప్పు ముట్టించే తాడు.
  • 2. కర్ణాటకపు తుపాకుల చెవియం దుండే నిప్పు ముట్టించే త్రాడు.
  • బాణసంచా కాల్చేందుకూ ఉపయోగిస్తారు.

జా నగు

  • అంద మగు; తేట యగు.
  • "పల్కుననబోఁడి జా నగుపల్కు లిడుచు." అచ్చ. రా. బాల. 6.

జా నఱు

  • విచక్షణాజ్ఞానం కోల్పోవు.
  • "జానఱి పశుపతి నుఱక వి, దానమహారంభుఁ డైనదక్షుం డనున,జ్ఞానికి." కుమా. 2. 15.

జానుగా

  • తేటగా.

జానుతెనుగు

  • తేట తెనుగు. మంచి తెనుగు.
  • "సరళము గాఁగ భావములు జాను తెనుంగున నింపుపెంపుతో..." కుమా. 1. 35.
  • "ఉరుతర గద్య పద్యోక్తుల కంటె, సరస మై పరఁగినజాను తెనుంగు, చర్చింపఁగా సర్వసామాన్య మగుట...." బస. 1.

జానుపడు

  • తేట తెల్ల మగు. భార. ఆర. 2. 214.

జానువాఱు

  • చూ. జానుపడు.