పుట:PadabhamdhaParijathamu.djvu/859

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జలు - జల్లి 833 జల్లి - జవ

జలుబునీళ్లు వదలిపోవు

  • పొగ రడగు. కొత్త. 187.

జల్ల బండి

  • పైన కప్పు లేనిబండి. కొత్త. 48.

జల్లి గంప

  • సందు లున్న గంప.

జల్లి తోక

  • కుచ్చుతోక.

జల్లి నీడ

  • మధ్యమధ్య వెలుతురు పొడలున్న నీడ.

జల్లి పెండెము

  • ఒక నగ.

జల్లిమాటలు

  • వ్యర్థ ప్రలాపాలు, వట్టి మాటలు.
  • జల్లెడ పట్టగా నిలుచునవి గట్టివి. అలా కానివి జల్లి మాటలు.
  • నడుమ నడుమ సడలి విచ్చి పోయిన అనగా సత్యేతరత బయల్పడిన వగుటతోనూ జల్లిమాటలు కావచ్చును.
  • "జల్లిమాటలు గాక సరిసేయ వచ్చు నే, సవరంబు లీశిరోజాతములకు." హంస. 1. 210.

జల్లి ముత్తెము

  • సన్నటిముత్యము. బ్రౌన్.

జల్లిమూకుడు

  • నడుమ సగందాకా రంధ్రాలున్న మూకుడు, సిబ్బి రేకు.

జల్లివేరు

  • కొస కుచ్చుగా ఉన్న వేరు.

జల్దుకొని వచ్చు

  • త్రోసుకొని వచ్చు.
  • "జల్దుకొని వచ్చెఁ బైపైని సారమేయ, యాధములు." హర. 7. 38.

జల్లుకొను

  • మూగు, గుంపగు.

జల్లు లాడు

  • జలక్రీడ లాడు, నీళ్లు చల్లుకొను.
  • "ఒండొరులమీఁద జలములు నిండుకొనఁగ, జల్లు లాడిరి సరసిలో సరసముగను." ఉషా. 2. 12.

జల్లెడపాటు వడు

  • దట్టంగా పెరుగు.

జవకట్టు

  • కూడిన, మేళవించిన.

జవకట్టికొను

  • భద్రపఱుచుకొను, కూడుకొను.
  • "భవరోగములు వీడి పాఱంగఁ బెద్దలు మున్ను, జవ కట్టుకొనిన నిచ్చల మైన మందు." తాళ్ల. సం. 5. 140.