పుట:PadabhamdhaParijathamu.djvu/860

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జవ - జవ 834 జవు - జవ్వా

జవజవ లాడు

 • ఊగాడు, కంపించు.
 • చూ. జవదాటు వివరం.

జవజవ మను

 • కంపించు.

జవదాటు

 • మేర మీఱు.
 • ఏ కొంత యైన అనే అర్థంలో జవ ఉపయుక్త మైనది. జవదాటక పోవడం అంటే ఏ కొంత కూడా మేర మీరక పోవడం అని అర్థం. సన్నని గోధుమలను జవగోధుమ లంటారు. సన్నని గోధుమంత కూడా దాటకుండడ మన్నమాట. సన్నని వస్తు వేదైనా కదలుటకు జవజవ లాడుట అంటారు.
 • "తనయాజ్ఞ జంగమస్థావరజంతుసం, తాన మెన్నఁడు జవదాట వెఱవ." కా. మా. 1. 28.
 • "ఈ రీతి సకలధర్మవి, చారుం డగు నతనిమాట జవదాటక." శుక. 1. 179.

జవళివాడు

 • బట్ట లమ్మువాడు. బ్రౌన్.

జవళియంగడి

 • బట్టల దుకాణం. బ్రౌన్.
 • నేటి వాడుకలో జవిళి.

జవుజవ్వు '*ధ్వన్యనుకరణము. జవాదివంకి

 • పునుగు, జవ్వాది సౌందర్య వర్ధకములుగా మనకు ప్రతీతి. లక్షణయా అతి సౌందర్యవతి అనుట.
 • "వరల సొంపుల టెంకి జవాదివంకి, జాతి రతినీల నారాజదూతి హేల." హంస. 1. 81.
 • చూ. జవ్వాదివంకి.

జవ్వన మమ్ముకొను

 • డబ్బుకై వ్యభిచరించు.
 • "సంత నెన్నఁడో, జవ్వన మమ్ముకొన్న గడసాని ననుం గవయం దలంచితే." ఉ. హరి. 1. 74.

జవ్వాజివంకెలు

 • ధాన్యవిశేషం.

జవ్వాడు

 • కదలాడు.
 • పలుచగా, సన్నగా ఉన్నవాని కదలికలోనే ఇది ప్రయుక్త మవుతుంది.
 • "నృపుఁ డుపవడ మై, జవ్వాడులతికయో యన, నవ్వెలఁది వడంకఁ జూచి." శుక. 1. 313.
 • చూ. జవజవ లాడు.

జవ్వాదిపిల్లి

 • పునుగుపిల్లి, సంకుమృగం.

జవ్వాదివంకి

 • చూ. జవాదివంకి.