పుట:PadabhamdhaParijathamu.djvu/837

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేర్చు - చేఱు 811 చేఱు - చేవ

సప్తాంభోధివేష్టీభవత్, .....రాజ కుమారుండు." హరిశ్చంద్రో.

చేర్చుక్క

  • పాపటబొట్టు.
  • "చేర్చుక్కఁ జేరిచి చిత్రంబుగాను." పల. పు. 72.
  • "చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లి చే, సిందూరతిలకంబు చెమ్మగిల్ల." మను. 1. 5.
  • "చొనిపె సీమంతవీధిఁ జేర్చుక్క యోర్తు." ఆము. 6. 128.
  • చూ. చేరుచుక్క.

చేర్లకోల

  • చెలకోల. వరాహ. 5. 108.

చేర్వచుట్టములు

  • దగ్గఱిచుట్టాలు. నిరం. 4. 69.

చేర్వారు

  • సమీపించు, దగ్గఱపడు.
  • "వై,శృంఖల్యంబునఁ బట్టు కళ్లెపు సరుల్ చేర్వార నుచ్చైశ్రవ: కంఖాణంబు గదల్చె." నిరంకు. 4. 125.

చేఱుకుట్టు

  • ఒక రోగము.

చేఱుకోల

  • చూ. చేరుకోల.

చేఱుబొందు

  • కొట్టెడు తోలుపట్టెడ. శ. ర.

చేఱులకోల

  • చెలకోల. శ. ర.

చేలా గిచ్చు

  • చేయూత నిచ్చు.
  • "చేరి చేలాగిచ్చు..." ఇందు. 3. 27.

చేలు దొండముక్కు పడు

  • ఎఱ్ఱ బారు, పక్వ మగు.
  • "దొండముక్కు వడియెం బ్రాసంగుఁ జేల్." శివ. 4. 19.
  • "పెస రుసురుకొనియె దవనిక పొదలె, ఱెక్క ప్రాసంగు దొండ ముక్క వడియె." కాశీ. 3.23.

చేవగల వాడు

  • సత్త్వవంతుడు.
  • చూ. చేవబారు.

చేవట్టి తిగుచు

  • చేయి పట్టి లాగు.
  • "నీకు బలె సన్మానంబుతోఁ జక్క వ,చ్చెదొ యేమే గలదే యటంచుఁ దిగి చెం జేవట్టి యా యంగనన్." కళా. 7. 123.

చేవ డించక

  • చేతితో పట్టుకొని నలిగిపోవునట్లు చేయక.
  • చేవ - సారముపై, డించు వచ్చిన దనుకుంటే=సారవిహీనము కాకుండ అనుట.
  • "....చేవ డించక కావడించి." పాండు. 3. 89.