ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చెడ - చెడి 767 చెడి - చెడు
- "హరుఁ జెడనాడి, వీరిఁ గొని యాడెదు." కుమా. 2. 31.
- "అఖిలజనులు నిన్, గడుఁ బేద మనసు వాఁ డని, చెడనాడుదు రనిన మము నిసీ యను టరుదే..." భార. శాంతి. 1. 117.
- "సాధ్వి నూరక చెడనాడ నేల?" భాస్క. యుద్ధ. 2398.
- "తా నెవ్వ తెయొ నన్నుఁ దఱిమి యీడ్వ నటంచుఁ, దోడికోడలిఁ జెడనాడువారు." శుక. 3. 121.
- "ఆదరణంబు లేక చెడనాడిన బాణ మయూర కాళిదా, సాదుల కైనఁ దప్పు గలదు." సింహా. 1. 14.
చెడబుట్టు
- సద్వంశంలో దుర్మార్గు డై పుట్టు.
- "అంత మహాపండితులవంశంలో ఈ వెధవ చెడబుట్టాడు." వా.
చెడమడ తిట్టు
- నోటికి వచ్చినట్లు తిట్టు.
- "దానిని జెడమడ దిట్టు దిట్టి యితర దేశీయుల కప్పజెప్పితిమి...." సాక్షి. 322 పే.
- రూ. చెడా మడా తిట్టు.
చెడ విఱుగు
- చెదరి పాఱు.
- "చెడ విఱిఁగి యడవిఁ బడి, యెడ నెడఁ గట్టులతుదలఁ గోటి యిడి లోఁగడకున్." ఆము. 3. 17.
చెడినసొమ్ము
- దొంగసొత్తు.
- "చెడినసొ మ్మెవ్వనిచే నుండు వాని... పట్టి యరయు వలయు." విజ్ఞా. ప్రా. 25.
చెడి పాఱు
- చెదరి పాఱు.
- "మండి పదాతులఁ గొందఱుఁ జెండాడిన నున్నవారు చెడి పాఱిరి." ఉత్త. హరి. 5. 225.
చెడిపోవు
- నాశ మగు.
- "ఫణుల బైసి చెడిపోవుఁ దుది నీరు పాము లగును." జైమి. 7. 82.
చెడి బతికిన
- బొత్తిగా తక్కువ స్థితిలో ఉండి పైకి వచ్చిన.
- ఇలాంటి వారికి గర్వమూ స్వాతిశయము ఎక్కువ అని.
- "అది వట్టి చెడి బతికిన ముండ. పెద్దా చిన్నా పాపభీతీ యివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి?" వా.
చెడుగడు
- క్రూరుడు. హరి. పూ. 8. 103.
చెడుగఱ్ఱ
- మాంసం ముక్కలు క్రుచ్చి కాల్చేందుకు పనికి వచ్చే కఱ్ఱ పుల్ల, కడ్డీ.
- "చెడు గఱ్ఱల గ్రుచ్చిన నం, జుడు మంటలఁ దగిలి నెయ్యి జొట జొట వడియున్." మను. 4. 19.
చెడుగాడు
- తిట్టు.
- "సముఖానం జెడుగాఁడు." మల్ల. నీతి. 49.