పుట:PadabhamdhaParijathamu.djvu/793

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెడ - చెడి 767 చెడి - చెడు

  • "హరుఁ జెడనాడి, వీరిఁ గొని యాడెదు." కుమా. 2. 31.
  • "అఖిలజనులు నిన్, గడుఁ బేద మనసు వాఁ డని, చెడనాడుదు రనిన మము నిసీ యను టరుదే..." భార. శాంతి. 1. 117.
  • "సాధ్వి నూరక చెడనాడ నేల?" భాస్క. యుద్ధ. 2398.
  • "తా నెవ్వ తెయొ నన్నుఁ దఱిమి యీడ్వ నటంచుఁ, దోడికోడలిఁ జెడనాడువారు." శుక. 3. 121.
  • "ఆదరణంబు లేక చెడనాడిన బాణ మయూర కాళిదా, సాదుల కైనఁ దప్పు గలదు." సింహా. 1. 14.

చెడబుట్టు

  • సద్వంశంలో దుర్మార్గు డై పుట్టు.
  • "అంత మహాపండితులవంశంలో ఈ వెధవ చెడబుట్టాడు." వా.

చెడమడ తిట్టు

  • నోటికి వచ్చినట్లు తిట్టు.
  • "దానిని జెడమడ దిట్టు దిట్టి యితర దేశీయుల కప్పజెప్పితిమి...." సాక్షి. 322 పే.
  • రూ. చెడా మడా తిట్టు.

చెడ విఱుగు

  • చెదరి పాఱు.
  • "చెడ విఱిఁగి యడవిఁ బడి, యెడ నెడఁ గట్టులతుదలఁ గోటి యిడి లోఁగడకున్." ఆము. 3. 17.

చెడినసొమ్ము

  • దొంగసొత్తు.
  • "చెడినసొ మ్మెవ్వనిచే నుండు వాని... పట్టి యరయు వలయు." విజ్ఞా. ప్రా. 25.

చెడి పాఱు

  • చెదరి పాఱు.
  • "మండి పదాతులఁ గొందఱుఁ జెండాడిన నున్నవారు చెడి పాఱిరి." ఉత్త. హరి. 5. 225.

చెడిపోవు

  • నాశ మగు.
  • "ఫణుల బైసి చెడిపోవుఁ దుది నీరు పాము లగును." జైమి. 7. 82.

చెడి బతికిన

  • బొత్తిగా తక్కువ స్థితిలో ఉండి పైకి వచ్చిన.
  • ఇలాంటి వారికి గర్వమూ స్వాతిశయము ఎక్కువ అని.
  • "అది వట్టి చెడి బతికిన ముండ. పెద్దా చిన్నా పాపభీతీ యివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి?" వా.

చెడుగడు

  • క్రూరుడు. హరి. పూ. 8. 103.

చెడుగఱ్ఱ

  • మాంసం ముక్కలు క్రుచ్చి కాల్చేందుకు పనికి వచ్చే కఱ్ఱ పుల్ల, కడ్డీ.
  • "చెడు గఱ్ఱల గ్రుచ్చిన నం, జుడు మంటలఁ దగిలి నెయ్యి జొట జొట వడియున్." మను. 4. 19.

చెడుగాడు

  • తిట్టు.
  • "సముఖానం జెడుగాఁడు." మల్ల. నీతి. 49.