పుట:PadabhamdhaParijathamu.djvu/792

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెట్టె - చెట్ల 766 చెట్ల - చెడ

లేక అటూ ఇటూ కొట్టు కుంటుంది.

  • "చెట్టు విడిచినభూతంబుకడఁకతోడ." హంస. 1. 220.

చెట్టెక్కి చేతులు విడిచినట్లు

  • ఉన్నతస్థితికి పోయి దానిని నిలుపుకొన లేక పోవు.
  • ఆధారము లేకుండా చేసుకొను.
  • "ఇవ్విధంబున నావిద్య లెల్ల మోటు, వడినఁ జెట్టెక్కి చేతులు విడిచినట్లు, శోకచింతానిమగ్నుండ నై..." వరాహ. 1. 96.

చెట్టెక్కు

  • మూల బడు.
  • "కృష్ణునిప్రతిమ చెట్టెక్క లేదె." గీర. గురు. 52.
  • చూ. చెట్లను గట్టు.

చెట్టొకడు గాగ పఱచు

  • దిక్కు కొకడు గా పోవు.
  • "ఒకఁడు పోయిన త్రోవ వే ఱొకఁడు పోక, చె ట్టొకఁడు గాఁగఁ బఱచిరి చెంచు లపుడు." మను. 4. 103.
  • చూ. చెట్టు కొక డై చను.

చెట్టొక పిట్ట యగు

  • చెల్లాచెద రగు.
  • "తరుణి నీనడలతో సరి రాక యంచలు, చెట్టొక పిట్ట యై చెదరి పాఱె." కవిచకోర.
  • చూ. చెట్టు కొక డై చను.

చెట్లను గట్టు

  • ఉపయోగించక పైన ఎత్తి పెట్టు; మూల బెట్టు; పూజ పెట్టు.
  • ఈ అర్థంలో నేటి వాడుకలోని పలుకుబడి - అట్టవమీద పెట్టు, మందహాసంలో పెట్టు, పూజ పెట్టు మొదలగు రూపాలలోనే కానవస్తుంది.
  • "శౌర్యముల్ చెట్లను గట్టెడు మాడ్కి." జైమి. 6. 137.
  • ప్రస్తుతప్రయోగంలో పరాక్రమాల నన్నిటినీ ఉపయోగించకుండా చెట్లమీద పెట్టి - మూల పెట్టి అనగా శౌర్యము మాలి...

చెట్ల వట్టు

  • అడవుల పా లగు.
  • "ఎవ్వఁ, డేని సప్తాంగములు నీకు నిచ్చి చెట్లు, వట్టి పెన్రాల తిప్పలు వట్టి తిరుగు." ఆము. 3. 24.
  • "ఇడుమల కోర్చి పాపి యై చెడి చెట్లఁ బట్టినవాని." వర. రా. అర. పు. 139. పంక్తి. 18.
  • రూ. చెట్ల బట్టు.

చెడగొట్టు

  • పాడు చేయు.
  • "ధ్వజంబులఁ జెడఁ గొట్టుచు." ఉత్త. రా. 2. 61.
  • "పనంతా చెడగొట్టాడు వచ్చి కూచొని." వా.

చెడనాడు

  • నిందించు.