పుట:PadabhamdhaParijathamu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంపా_________అంబ 18 అంబ________అంశ

అంపాచారంపు వానలు

  • జడివానలు.
  • "అంపాచారంపు వానలప్పుడు కురిసె." వి. పు. 7. 67.

అంపించు

  • పంపు.
  • చూ. అంపబంపు.

అంపుదోళ్ల వెధవ

  • ఒకతిట్టు. అసమర్థుడు.

అంబకళము

  • అంబలి.
  • ఈ అంబకళమే అంబలి అయి యుండవచ్చును.
  • "అతని నగర గాచునంబకళంబు ప్రతి వచ్చునే." బస. 5. 152 పు.

అంబటిప్రొద్దు

  • దాదాపు తొమ్మిదిగంటలవేళ, ఉదయము.
  • అంబళ్లు తాగేప్రొద్దు అనుటపై ఏర్పడినది. రాయల సీమలో రైతులు, కార్మికులు ఇత్యాదులు ఉపయోగించే పలుకుబడి.
  • "అంబళ్లప్రొ ద్దయింది. త్వరగా చేలోకి వెళ్లాలి." వా.
  • "అంబటిప్రొద్దు కాగనె" పె. పా.

అంబ పలక లేదు

  • డబ్బు చిక్క లేదు, పని కాలేదు అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.

అంబళ్ళపొద్దు

  • చూ. అంబటిప్రొద్దు.

అంబస్తు

  • లోకజ్ఞానము లేనివాడు. ఆం. భా.

అంబాజీపేట ఆముదం

  • పట్టుకొంటే వదలని.
  • ఇది స్థానికంగా యేర్పడిన పలుకుబడి.

అంబూకృతి చేయు

  • తూథూ అని మూయు, ఉమ్మి వేయు.
  • "కెం పగుచూడ్కి జూచి యం, బూకృత మాచరించుటకు బుద్ధి దలంక."
  • పాండు. 3. 95.

అంబేద

  • దుర్బలుడు, అసమర్థుడు.
  • "వేదుఱు బల్కి న న్నదర వేయగ జూచెదు ఇందు నంత నంబేదలు లేరు." పద్మ. 3.
  • "వాడు ఒట్టి అంబేద. వాణ్ణి పంపించి ఏం లాభం?" వా.

అంబోదర గిడ్డడు

  • బాన కడుపువాడు.

అంశ చక్రము

  • జాతకంలో రాశిచక్రం కాక అంశ చక్రం ఒకటి ఉంటుంది. ఏ ఏ నవాంశలో యే గ్రహాలున్నదీ, లగ్నం ఏ నవాంశ అయినదీ తెలిపే చక్రం.