పుట:PadabhamdhaParijathamu.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంశ________అక 19 అక_________అకా

అంశ పురుషుడు

  • దశావంతుడు.
  • "వాడు చాలా అంశ పురుషుడు. అడివిలోకి వెళ్ళినా వాడి కన్నీ అమరుతాయి." వా.
  • చూ. అంశ మంచిది.

అంశ మంచిది

  • దశావంతు డనుట.
  • "వాడి అంశ చాలా మంచిది. చేసినా చేయక పోయినా దర్జాగా నడుస్తూ ఉంది."" వా.

అంశలో ...

  • దశలో....
  • జ్యోతిశ్శాస్త్రరీత్యా వచ్చిన పలుకుబడి. ఏ లగ్నంలోని యే అంశలో పుట్టాడు అన్న దానిపై ఫలితాలు చెప్పడం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం.
  • "వా డిప్పుడు మంచి అంశలో ఉన్నాడు. మనలాంటివాళ్లను పలకరిస్తాడాఆ?"
  • "వాడు మంచి అంశలో పుట్టాడు. ఏం వచ్చినా వాణ్ణి ఏం చెయ్యదు." వా.
  • చూ. అంశ మంచిది.

అకట(టా)వికటం అగు

  • పరిహాసపాత్రమగు అస్తవ్యస్తమగు.
  • "వాడు ఏది మాట్లాడినా అకటవికటమే."
  • "ఆ పని అంతా అకటావికటం అయిపోయింది." వా.

అకటావికటపు మనిషి

  • వక్రంగా మాట్లాడేవాడు.

అకటావికటపు రాజు అస్తవ్యస్తపు ప్రధాని అన్నట్లు

  • ఎగుడుదిగుడుగా పాడుపాడుగా ఉన్న దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • జానపద కథలలోనుండి వచ్చిన పలుకుబడి. ఆ పేరు గలరాజు, ప్రధాని ఒక ఊళ్లో ఉంటారు. వాళ్లు రాత్రి అంతా పని చేయా లని పగ లంతా నిద్ర పోవా లని శాసిస్తారు.
  • "వాళ్లింటి వ్యవహారం అంతా అకటావికటపు రాజు అస్తవ్యస్తపుప్రధాని అన్నట్లుగా ఉంది." వా.

అకస్మాత్తుగా

  • ఉన్నట్లుండి.
  • "వాడు అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు." వా.

అకాండతాండవం

  • అసందర్భప్రసంగం; అనవసర ఆవేశం.
  • "వాడిది వట్టి అకాండతాండవం."
  • "అనే దేదో వాడి యెదుట అనక యింట్లోకి వచ్చి అకాండతాండవం చేస్తా వేమిటి?" వా.

అకారతుగా

  • అకారణంగా.

అకాలకూష్మాండం

  • నిరర్థకజన్మ మనుట, నిష్ప్రయోజకు డనుట.
  • "వాడు ఒట్టి అకాలకూష్మాండం." వా.