ఈ పుట ఆమోదించబడ్డది
అకా_________అక్క 20 అక్క_________అక్క
అకాలభోజనం
- వేళ మీఱినభోజనము.
- "ఎండలో రావడం, అకాలభోజనం, మహా ఆయాసంగా ఉంది. కాస్సేపు నడుం వాలిస్తే గాని కుదరదు." వా.
అక్కతోడు
- "అక్క తోడు సుమీ నాకు ముక్క రైన, జేసి తెప్పించు మని."
- నిరంకు. 2. 115.
అక్కడక్కడ
- కొన్నిచోట్ల.
- "అక్కడక్కడా అంటుండగా విన్నాను." వా.
- "అక్కడక్కడా మచ్చ లున్నట్టున్నాయి." వా.
అక్కడ భోంచేసి ఇక్కడ చేయి కడుగుకొనవలెను
- తక్షణమే రమ్మనుట.
- "అమ్మకు చాలా జబ్బుగా ఉంది కాబట్టి వెంటనే రావలెను. అతిజరూరు. అక్కడ భోంచేసి యిక్కడ చెయ్యి కడుగుకొనవలెను." వా.
- "వాడు దాన్ని పట్టాడు. ఎప్పుడూ అక్కడే, తనింట్లో తిని దానింట్లో వచ్చి చెయ్యి కడుక్కుంటాడు." వా.
అక్కడికి అక్కడికే సరిపోవు
- ముటీముటాలుగా సరిపోవు.
- "అంతపంట వచ్చినా అక్కడి కక్కడికే సరిపోవడమే కష్టంగా ఉంది. ఆ కాస్తా పోతే దేవుడే దిక్కు." వా.
అక్కన్న మాదన్నలు
- ఎప్పుడూ కలిసి తిరుగువారు.
- "వా ళ్లిద్దరూ అక్కన్నమాదన్నలు." వా.
అక్కరగాడు
- తనపని తీర్చుకొనువాడు.
- "అక్కఱకాడ నై అందంద ప్రేరేచి." క్షేత్రయ్య.
అక్కఱ గాచు
- సమయమున కాదుకొను
- "మునిమాపు బలు గంబమున బుట్టి బంటున, క్కఱ గాచినట్టి సింగంబ నీవు." పారి. 1. 49.
అక్కరపడు
- అవసర మేర్పడు.
- "అక్కరపడి నీదగ్గరకు వచ్చాను. తప్పక సహాయం చేయాలి."
- "పదిరూపాయలు అక్కరపడింది." వా.
అక్కఱకు రాని
- పనికి రాని, పనికి మాలిన.
- రాయలసీమలో ఇది చాలా ప్రచురంగావినబడే పలుకుబడి.
- "ఈ అక్కఱకురాని మాటలతో ఏం పని." వా.
- "అక్కఱకు రాని చుట్టము." సుమ.
- "వాడు వట్టి అక్కఱకురాని ముండా కొడుకు." వా.
అక్కఱగండడు
- అక్కఱ గడుపుకొనువాడు, స్వార్థపరు డనుట.
- ఇతరుల అక్కఱను స్వార్థమునకై ఉపయోగించుకొనువాడు.
- "అక్కఱగండ డై యప్పటప్పటికి వెక్కసంబున నూర్లు వేలు నప్పిచ్చి ముట్ట జిక్కినవేళ ముట్టి చేపట్టి రట్టడై తిరిగి పత్రంబులు గొనుచు."
- గౌ. హరి. ద్వి. 477-480.
~