ఈ పుట ఆమోదించబడ్డది
అక్క________అక్క 21 అక్క__________అక్కు
- శ.ర. లో శ్రద్ధ గలవాడు అనీ, సూ. ని. వావిళ్లలలో ఆవశ్యకతను కనిపెట్టువాడు అనీ ఇచ్చిన అర్థాలు సరికావు.
అక్కఱచీటి
- జాబు.
- "కొనగోర మొగలిరేకున గమ్మకస్తూరి వలపు నక్కఱచీటి వ్రాయవమ్మ."
- రాజగో. 2. 44.
అక్కఱ తీరేవఱకే
- స్వార్థం తీరేవఱకే.
- "వాడిస్నేహమంతా అక్కఱతీరేవరకే. ఆతరవాత మొహం సూపిస్తే ఒట్టు." వా.
అక్కఱ దీర్చు
- సమయమునకు పనికి వచ్చు.
- "ఆపద కైనబంధుజన మక్కఱ దీర్చు ధనంబు." నిరంకు. 4. 99.
- "నా యక్కఱ దీర్పవచ్చిన లతాంత కృపాణివి నీవె నీకు నే దక్కితి నంచు బ్రేమ నిగుడన్..."
- శుక. 3 అ. 532 ప.
అక్కఱపడి
- పనిపడి.
- "అక్కఱపడి నీవు వేడు టిది కర్జమె."
- భార. అర. 7. అ.
- "పదిరూపాయలు అక్కఱపడి నీ దగ్గరకు వచ్చాను." వా.
అక్కఱ లేదు
- చాలు, వద్దు, కాబట్టదు.
- "అన్నం అక్కఱ లేదు. కాస్త మజ్జిగ పోయండి చాలు." వా.
- "నాకు కాఫీ అక్కఱ లేదండి. కాసిని మంచినీళ్లు ఇవ్వండి." వా.
- "వాడికి పనీపాటా అక్కఱ లేదు. ఏదో నవల చిక్కితే చాలు. చదువుతూ కూర్చుంటాడు." వా.
అక్కలవాడ
- పూటకూళ్లమ్మ లుండుచోటు.
- చూ. అక్క వాడ.
అక్కవాడ
- పూటకూళ్లమ్మలు నివసించే చోటు.
- చూ. అక్కలవాడ.
- "అక్క వాడల నరకూళ్లు మెక్కి." ఆము. 6. 67.
అక్కసు పట్ట లేక
- కోపము, కసి తీరక.
- రుద్రమ. 15 పు.
అక్కా ఆలీ అను
- బూతులు తిట్టు.
- "వాడి దగ్గిరికి ఈవిషయ మై పోతివా వాడు అక్కా ఆలీ అని మొదలు పెడతాడు." వా.
అక్కిలజేయు
- ముంచించు.
- "ఱొ మ్మక్కిలజేసి చేసి." క్రీడా. పు. 15.
అక్కిలివఱచు
- చెడు, కలతవడు.
- పండితా. ప్రథ. దీక్షా. పుట. 178.
అక్కుగొఱ్ఱు
- బాధ కలిగించునది, పక్కలోని బల్లెము.
- "అవనీశులకు నెల్ల నక్కు గొఱ్ఱగుచు." బసవ.