Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కు________అక్కె 22 అక్కె_________అక్ష

అక్కున నద్దు

  • కౌగిలించుకొను.
  • అక్కున జేర్చు - అక్కున నొత్తుకొను ఇత్యాదులు.

అక్కుపక్షి

  • 1. తిట్టు.
  • "అగ్గి రాములు కొరకచ్చు లక్కు పక్షు లింగిలాయలు." ప్రభా. నాట. 5.
  • 2. దుర్బలుడు, ఎముకలపోగు అనుట.
  • తిరుపతి. ప్రభా. నాట. 5. పుట.
  • "వాడు వట్టి అక్కు పక్షి." వా.

అక్కుమాలిన భంగి

  • దిక్కు లేనట్లు, ఇక్కడ ఆడ్యు డెవరూ లేనట్లు.
  • గుండె అన్న అర్థం 'అక్కుకు' చెప్పి వావిళ్లాదులు ఈ ప్రయోగ మిచ్చినవి. ఆ అర్థం సరిపడదు. గుండెమాలుట ఏమిటి? అక్కుపక్షిలో ఉన్న అక్కు, ఱొమ్ము గుండె - కాక మఱొకటని తెలుస్తూనే ఉంది.
  • "అక్కు మాలినభంగి నగ్రహారంబు చక్కన మీ కెట్లు చన జేరవచ్చు."
  • బస. 7. అ. 185 పుట.

అక్కెత్తికొనక

  • నడు మెత్తక, ఎడ తెఱపి లేక.
  • "నడుం ఎత్తకుండా పనిచేస్తున్నాడు" అని వాడుకలో ఉంది. నడుముకు బదు లిక్కడ అక్కు - ఱొమ్ము.
  • "ఇట్లందఱు న్న క్కెత్తికొనక చేయు శిశిరోపచారంబులు." కుమా. 5. 159.

అక్కెత్తుకొనక

  • తదేక దృష్టితో, విడువకుండా, నడు మెత్తక వంటిది. నడుమునకు బదులు ఇక్కడ అక్కు.
  • "అ క్కెత్తుకొనక చేయుశిశిరోపచారంబులు.: కు. సం. 5. 151.
  • (పాఠాంతరం పై రూపాంతరం)

అక్షతయోని

  • కన్య.

అక్షతలుపడు

  • చూ. అక్షింతలు పడు.

అక్షతలు వేయు

  • చూ. అక్షింతలు వేయు.

అక్షతారోపణం

  • తలంబ్రాలు పోయుట.
  • "తొమ్మిదిగంటలకు అక్షతారోపణం. మీరు తప్పకుండా రావాలి." వా.

అక్షమాల

  • జపమాల.
  • అక్షరక్రమా న్ననుసరించి జపమాల కూర్చేవారు. 'అ' నుండి 'క్ష' వరకూ అక్షర క్రమం కనక వచ్చినపలుకుబడి.

అక్షయ్యంబుగ

  • సమృద్ధిగా.
  • "అక్షయ్యంబుగ దివ్యమాధుకరభిక్షాన్నంబు వడ్డించె..." హర. 5. 45.

అక్షరం రాదు

  • కొంచెం కూడా చదువు రాదు.