పుట:PadabhamdhaParijathamu.djvu/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్ష_________అక్ష 23 అక్ష__________అక్ష

̈*"వాడికి అక్షరం రాదు. అయినా వాడి తలబిరుసుతనం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది." వా. అక్షరక్రమం తెలీదు

 • ఏమాత్రం చదువు రాదు.
 • "వాడికి సరీగా అక్షరక్రమం కూడా తెలీదు." వా.
 • చూ. వర్ణ క్రమం తెలీదు.

అక్షర చొరవ

 • చదువులో ప్రావీణ్యము.
 • "వాడికి అన్న చొరవే కాని అక్షరచొరవ లేదు." వా.

అక్షరజ్ఞానం

 • చదువు.
 • "వాడికి అక్షరజ్ఞానం ఉంది. ఏదో పొట్ట పోసుకో లేక పోతాడా."
 • "వాడు ఏదో అక్షరజ్ఞానం కలవాడు, ఆస్తి లేక పోతే యేం?" వా.

అక్షరజ్ఞానశూన్యుడు

 • నిరక్షరకుక్షి.
 • "వాడు ఒట్టి అక్షరజ్ఞానశూన్యుడు. వాడితో ఎవరు వేగుతారు?" వా.

అక్షరక్షరం తప్పు

 • ప్రతిదీ తప్పే.
 • "ఆ పుస్తకంలో అక్షరక్షరం తప్పు." వా.

అక్షరక్షరం పట్టి చూచు

 • క్షుణ్ణంగా పరిశీలించు.
 • "నీ వేదో పండితుడి వని వచ్చాను. ఈ పుస్తకంలో అక్షరక్షరంపట్టిచూచి సవరించి యిచ్చేభారం నీదే." వా.

అక్షరం మార్చడానికి వీల్లేదు

 • యథాతథంగా ఉండాలి, ఏమాత్రం మార్చ రాదు.
 • "ఇందులో అక్షరం మార్చడానికి వీల్లేదు."
 • "ఈ దస్తా వేజును ఆయన అక్షరం మార్చడానికి వీల్లేకుండా రాశాడు." వా.

అక్షరంముక్క రాదు

 • కొంచెం కూడా రాదు.
 • "వాడికి వ్యాకరణం ఒక అక్షరం ముక్క రాదు."
 • "వాడి కీ వ్యవహారంలో ఒక్క అక్షరం ముక్క తెలియదు." వా.
 • చదువుపై వచ్చిన పలుకుబడి.

అక్షరలక్షలు

 • పూర్వం కవిత్వం చెప్తే సంతోషించిన రాజు ఒక్కొక్క అక్షరానికి లక్షచొప్పున ఇచ్చే వాడు. అందుపై వచ్చిన పలుకుబడి.
 • "ఈ కావ్యానికి నాదగ్గఱ డబ్బే ఉంటే అక్షరలక్షలు ఇచ్చి ఉందును." వా.

అక్షరలక్షలు చేయు

 • అమూల్య మగు, అతిమనోజ్ఞ మగు.
 • "వాడిపద్యం అక్షరలక్షలు చేస్తుంది."
 • "అక్షరలక్షలు చేసేమాట అన్నావు." వా.

అక్షరాభ్యాసం

 • "తొలిసారిగా పిల్ల లకు అక్షరములు నేర్పుట. ఇది ఒక సంస్కారం.
 • "ఇంపుసొంపులు గ్రుమ్మరింపు మాటల వీణ, పలుకుల కక్షరాభ్యాసమొసగు."
 • అని. 2.31.