పుట:PadabhamdhaParijathamu.djvu/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అందు_______అంప 17 అంప________అంప

అందుకొను

 • పరిగ్రహించు.
 • "ఆ పాయసంబు దా నందుకొనియె."
 • రంగ. రా. బాల. పు. 19. పంక్తి 21.

అందుకొన్నట్టు

 • దగ్గరగా.
 • "గుంతకల్లునుంచి నున్మాడుమీద పోతే కాశీ అందుకొన్నట్టు ఉంటుంది." వా.

అందుబడి యగు

 • అందుబాటులోనికి వచ్చు.
 • ఇది నేడు అందుబాటు అనే రూపంలోనే కానవస్తుంది.
 • "సమస్తజీవులకు నందుబడి యైనదేవ భూజ మయ్యె." భోజ. 1. 79.

అందుల కేమి ?

 • దాని కేమి ?
 • పరవా లే దనుట.
 • "నా విని యందుల కేమి స్వభావగతిం బాడు మనిన భామిని గానప్రావీణ్యము జూపెను గడు." కళా. 7. 199.

అందె వేసినచేయి

 • సమర్థుడు.
 • ఏదైనా పనిలో - విద్యలో సమర్థు డైనవానిచేతికి అందె వేసేవారు. అందుపై యేర్పడినది.

అంపకము గాంచు

 • సెలవు తీసికొను.
 • "అంపకము గాంచె దీర్థయాత్రాభి రతిని." విజయ. 2. 41.

అంపకము చేయు

 • పంపించు.
 • "పూర్వమున బ్రహ్మసభకు నే బోయి కొంత, కాల మందుండి యజు డంప కంబు సేమ.
 • హంస. 4. అ. 7 వ.
 • చూ. అంపకాలు పెట్టు.

అంపకాలు

 • అత్తవారింటికి కొత్తకోడలిని పంపునప్పుడు అప్పగించుటలు. లక్షణయా అప్పు డిచ్చు కానుకలు.
 • అలాగే పెండ్లికి వచ్చినచుట్టాలను సాగనంపునప్పుడు చేసే మర్యాదలకు కూడా వాచక మయింది.
 • "అంపకాలవేళ అలా యేడవకూడదు తల్లీ!" వా.
 • "పెళ్లి అంతా అయిపోయినది, ఇంక అంపకాలే తరువాయి." వా.

అంపకోల

 • అమ్ము.
 • "అర్కనందను సెలకట్టె యంపకోల."
 • క్రీడా. పు. 71.

అంపతప్పు

 • దెబ్బ తప్పించుకొను నేర్పు.
 • "కానకు నంపతప్పెఱుగుగబ్బి మెకంబులు." కకు. 4. 57.

అంపబంపు

 • అంపించు, పంపించు, పంపు.
 • "అజ్జముప్రోలి కతని నంపబంపినవాడ నంపించినాడ."
 • పండితా. ద్వితీ. మహి. పుట.17.