ఈ పుట ఆమోదించబడ్డది
అంద________అంద 16 అంది_________అంది
అందంబు గూడుకొను
- ఇష్ట మున్నా లేకపోయినా ఇష్ట మున్నట్టు నటించు.
- "మీద గార్యంబులు గలమాకు దీనిగా దనం బనిలే దని యందంబు గూడు కొని ఛందోనువర్తనపరుం డై."
- ఆము. 6. 36.
- శ. ర. లో 'కలిసికొను' అను అర్థ మిచ్చారు. అది కుదురుట లేదు.
అందముల దీవి
- అందాల రాణి.
- ఇక్కడ దీవి అంటే స్థానము.
- " తావి తేనీయబావి యందముల దీవి."
- హంస. 2. 20.
అందలమం దుంచినకుక్క
- యోగ్య స్థాన మందున్న నీచుడు.
- గువ్వల చెన్న. 90.
అందలంబులు
- బాల్యక్రీడావిశేషము.
- "అందలంబులు మఱి కుందికాళ్లు."
- వి.పు. 7. 202.
- వాడి భుజంమీద వీడి రెండు చేతులూ, వీడి భుజంమీద వాడి రెండుచేతులూ పెట్టి నడుమ ఒకపిల్ల వాణ్ణి ఎక్కించు కొని ;దేవుడమ్మ దేవుడూ' అని ఊరేగిస్తూ ఆడేఆట.
అంద ఱొకటి యగు
- ఏక మగు.
- "అనురక్తి మీ రంద ఱొక టై యాదరించరాదా? హేమా. పు. 34.
అంది పొందని
- అతకని.
- రుద్రమ. 56 పు.
అందిక పొందిక
- ఈడుజోడు వంటిది. జం.
- "దానికీ దీనికీ అందికా పొందికా లేదు." వా.
అందిన చేనిపంట
- అందుబాటులోనిది.
- "ఎందు చూచిన శ్రీ వెంకటేశు డున్నా డనియెడి అందినచేనిపంట లనుభవించు." తాళ్ల. సం. 9. 70.
అంది పుచ్చుకొను
- గ్రహించు, దొరకి పుచ్చుకొను, సరిగ్గా అతికినట్టు.
- "వాడు కాళ్లు అంది పుచ్చుకొన్నాడు."
- "సిగ అంది పుచ్చుకొన్నాడు."
- "వాడు అన్నదాని కల్లా వీడు అంది పుచ్చుకొన్నట్టుగా సమాధాన మిస్తూ వచ్చాడు." వా.
అంది పొందినట్టివారు
- చుట్టాలు.
- "ఈ ఊళ్లో అందిపొందినవారు ఎవరూ లేరు. అందుకని యేకార్య మయినా పొరుగూరుకు పోవలసి వస్తుంది." వా.
అందిన సిగ అందకున్న కాళ్లు
- సమయానుకూలంగా ప్రవర్తించేవా డనుట.
- "...ఏ మనవచ్చు నీగుణం, బవు నవు నందినన్ సిగయు నందక యున్నను గాళ్లు పట్టుకొం, దువు హరిణాంక..."
- విజ. 3. 51.