ఈ పుట ఆమోదించబడ్డది
ఒట్టు____ఒడం 308 ఒడ____ఒడ
ఒట్టుపెట్టిన గతి
- ఎవరో నిషేధించినట్లు.
- ఒక్కమాటుగా, బొత్తిగా.
- "నీకు నాకు బని లేదని యనుచున్నంతలో, నొట్టు పెట్టినగతి వాన దొట్టున వెలసిన నదియును లంబోదర మహోదరంబుగా నెంచి..." శుక. 3. 258.
- "ఒట్టు పెట్టినట్లు ఒక్కడు కూడా ఆ పెండ్లికి వాళ్ళింటినుంచి రాలేదు." వా.
- చూ. ఒట్టిడినయట్లు.
ఒట్టు వేయు
- ప్రమాణము చేయు.
- "వాడు తన కేమీ తెలియ దని ఒట్టు వేసి చెబుతున్నాడు. మనం నమ్మకపోతే ఎట్లా?" వా.
ఒట్టు సుమీ!
- తప్పక ఇది జరుగుతుంది. ఇది నిజము అని చెప్పునప్పుడు ఒట్టు వేసికొనుట అలవాటు.
- "ఒట్టుసుమీ యన్న నొట్టు సుమీ యంచు..." కళా. 3. 207.
- వాడుకలో:
- 'వాడు వసే ఒట్టు' 'తప్పకుండా వస్తాడు. రాకపోతే ఒట్టు' ఇత్యాదు లూహ్యములు.
ఒడంబడు
- ఒప్పుకొను; కూడనిదానికి తల యొగ్గు; ఒడంబడిక చేసుకొను.
- "మహేశు నీచపలకుత్సితవిప్రుడు వచ్చి నోర గ్రొ,వ్వులు పలుకంగ మీరును జెవుల్ సొర వించు సహించి మాఱు మా,టలు నొడికట్టి పల్కెద రొడంబడి నట్టులు బ్రహ్మబంధుతోన్." కుమా. 7. 55.
- రూ. ఒడబడు.
ఒడగూర్చు
- సంతరించు.
- "యజ్ఞ సంభారముల్ వేగ నొడ గూర్పు మని." జైమి. 5. 134.
- వాడుకలో:
- 'ఒనగూర్చు' అన్నట్లు నేడు వినవస్తుంది.
- "పెళ్ళి కన్నీ ఒనగూర్చుకొని కదా మిగత సంగతులు మాట్లాడాలి." వా.
ఒడమలగొడ్డు
- ఆకారపుష్టి తప్పితే పనికి రానిది.
ఒడ లంటు
- అంగమర్దనము చేయు.
- "ఒడ లంట గాళ్లు పిసుకం, గడివెడు వేన్నీళ్ల నీయ గంచము వెట్టన్." శుక. 3. 341.
ఒడలు ఓడగు
- శరీరము పాడగు. కుండ పగిలితే ఓడు అవుతుంది కదా! అట్లే...
- "ఒడ లోడు కాజొచ్చు." నిరం. 2. 129.
ఒడలు కాల్చుకొను
- అనవసరజోక్యము కల్పించుకొని నష్టపడు.
- "ఇతరుల విషయంలో జోక్యం కల్పించు