ఈ పుట ఆమోదించబడ్డది
ఒక____ఒక 302 ఒక____ఒక
- "మానుమీ మోహ మని తెల్పి మానవేంద్రు, చిత్త మొగ్గించి యొకమాట జేసి..." శుక. 1. 464.
- "ఏదో ఒకమాట చేసుకుంటే, తర్వాత డబ్బూ దకసం చూసుకో వచ్చు. ముందు ధర తెగనీయండి." వా.
ఒక మాత్ర
- ఒక మాదిరిగా. దాదాపు అనుట.
- "భాస్కరు నొకమాత్ర నేల బడగా వెస నేయ." భాస్క. యుద్ధ. 1. 783.
ఒక మూల వేయు
- ఒక వైపు పడవేయు.
- "సూలచేకటు లొకమూల వైచి సిరాజి గనుపుల గళ్ల చేకటుల దాల్చి." శుక. 1. 237.
- "గుడ్డ లన్నీ ఒకమూల వేసిపోవే." వా.
- రూ. ఒక మూల పడవేయు.
ఒక మోస్తరుగా
- ఇంచుమించుగా.
- అంత బాగా లే దనుపట్ల ఖచ్చితంగా చెప్ప లేనప్పుడు ఉపయోగిస్తారు.
- "అతని కవిత్వం ఒక మోస్తరుగా ఉంటుంది." వా.
- "ఒక మోస్తరుగా ఆ వ్యవహారం ముడిపడ్డట్టే." వా.
ఒక యంచుక యించుక
- ఏకొంచె మయినా.
- "ఆడదు గాని మాట లొకయంచుక యించుక వీను లొగ్గి నా, యాడినమాట లెల్ల విను నర్మిలితో దను నేను జూచినం, జూడదు గాని యొండు దెస జూచిన దానును జూచుచుండు." శకుం. 2. 42. పే.
ఒక యించుక
- కొంచెము. భార. ఆది. 6. 115.
ఒక యింటివా డగు
- గృహస్థు డగు, వివాహితుడగు.
- "నీ వొక యింటివాడి వయితే చూసి కన్ను మూస్తాను. అంతకంటే నాకు కావలసిం దేముం దిక?" వా.
ఒక యింటివానిని చేయు
- వివాహితుని చేయు.
- "నిన్నొక యింటివాణ్ణి చేయా లని మీ నాన్న నానా యాతనా పడుతున్నాడు." వా.
ఒక యీడు
- ఒక వయసు.
- "వాడూ నేనూ ఒక ఈడువాళ్లం." వా.
ఒకరిమొగా లొకరు చూచుకొను
- చూ. ఒండొరుల మోములు చూచుకొను.
ఒకరి మోచేతికింద గంజి తాగు
- ఒకరిక్రింద నీచముగా బ్రతుకు.
- "ఒకరి మోచేతికింద గంజి తాగడం నా కిష్టం లేదు." వా.
(ఒకరి) సొమ్ము అగు
- సొంత మగు.
- "ఏ కార్యముల్ చేసినం, దనరన్ మంచివె కాని కాని వగునే ధర్మంబు నీ సొ మ్మగున్." ఉషా. 1. 42.
- 'అది వాని సొమ్ము. ఇది నీ