పుట:PadabhamdhaParijathamu.djvu/329

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఒక_____ఒక 303 ఒక_____ఒక

సొమ్ము' ఇలా రూపాంతరాలలో ఉపయుక్త మవుతుంది. ఒకరు చదివిన ఆకున ఇంకొకరు చదువు

 • అతని వంటివాడే యితడు అనుట.
 • "వాడు చదివిన ఆకులోనే వీడూ చదివాడు. వాడు నాలుగుకంపెనీలు పెట్టి దివాలా తీసి నాలుగు లక్షలు వెనుక వేస్తే, వీడు రెండు కంపెనీలతోనే పది లక్షలు సంపాయించాడు." వా.

ఒక లకారం చేత పట్టు

 • ఒక లక్ష సంపాదించు. కొత్త. 325.

ఒక లాగైన

 • అనిర్వర్ణనీయ మైన. ఇది అని నిశ్చితంగా చెప్పలేని భావాన్ని వివరించుపట్ల ఈ 'ఒక లాగు, ఒక విధం' అనే మాటలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ 'ఒక'తో చేరిన 'లాగు'కు పర్యాయ పదా లన్నీ ఈ భావాన్నే స్ఫురింప జేస్తవి.
 • "విని యొకింత కనలి మన సొక లాగైన, నతని నారదు డని యాత్మ నెఱిగి..." కళా. 1. 153.
 • వాడుకలో:
 • "నా కేమో ఈ దినం ఒంట్లో ఒక మాదిరిగా ఉంది." వా.,
 • "వాడి మొహం ఈరోజు ఒక రకంగా ఉంది." వా.
 • "వాణ్ణి చూచేటప్పటికి నా మనస్సు ఒక విధంగా అయి పోయింది." వా.

ఒకలాగున కానిపించు

 • ఏదో ఒకవిధముగా ఉండు. మామూలుగా ఉండకుండు అని చెప్పుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "నీ విదేమి చెపుమ నే డొకలాగున గానిపించుచున్న దాన వతివ." కళా. 7. 225.
 • "అత నెప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఏమిటో అత డీ రోజు అదొకలా గున్నాడు." వా.

ఒక వరుస సొమ్ములు

 • ఒకసారి శరీరమం దంతట ధరింపదగు సొమ్ములు. ఇలాంటివి, కలవారికి ఏడురకాలవి ఉండు ననుటపై వచ్చిన మాట. ఏడువరుసల సొమ్ములు. ఒక్కొక్క వరుసను ఒక్కొక్క వారం ధరించడంమీద ఏడువారాల సొమ్ములు అన్న మాట వచ్చింది. నేటికీ ఒక్కొక్కరోజు ఒక రంగు చీర కట్టుకుంటే ఆరంగు అలంకరణలే ఆపాదమస్తకం వేసుకోవడం అలవాటు. మాటకు - ఒక చీర కట్టుకుంటే అదేరంగు జాకెట్టు, అదేరంగు