ఈ పుట ఆమోదించబడ్డది
ఒక____ఒక 301 ఒక____ఒక
ఒక పరిపాటి కాదు
- మామూలుది కాదు. అసాధారణ మనుట.
- "మేటి యా క్షేత్ర మొక పరిపాటి గాదు." పాండు. 3. 129.
ఒకపాటి....
- సుమారైన, కొంచెం ఎదిగిన, తగుమాత్ర మైన - ఇలాటి భావచ్ఛాయలలో ఉపయుక్తమయ్యే పలుకుబడి. ఇంత, అంత లాగే చేతితో ప్రమాణము చూపుటద్వారా ఏర్పడినది.
- "బూమె లెఱుగని యొకపాటి బుడుత యాకు, మడుపు లందీయ..." హంస. 1. 120.
- ఇది నేటికీ వాడుకలో ఉన్నది.
- "ఒకపాటి మనిషి అయితే దీన్ని ఎత్తగలడు." వా.
- "ఒకపాటి మొద్దు తెచ్చి చెక్కితే దీనికి సరిపోతుంది." వా.
ఒకపూట కొకపూటకు
- రాను రాను క్రమక్రమంగా.
- "వారకులాచారవాసనాబాల్యంబు లొకపూట కొకపూట కుడిగిపోవు." కా. మా. 4. 23.
- "ఒకపూట కొకపూటకు ఆకలి చచ్చిపోతూ ఉంది." వా.
- రూ. పూటపూటకు.
ఒక పెట్టున
- ఒక్కుమ్మడిగా.
- "ఒకపెట్టున ద్రెళ్లి రంద ఱొగి రామునిచే." దేవీ. 3. 690.
ఒక పెద్దయె
- అది ఒక ఘనమా?
- "రౌద్రమూర్తినిన్, భీతి దొఱంగ జేయు టొక పెద్దయె వారితదేవతార్తికిన్." కా. మా. 3. 208.
- "అదొక పెద్దేనా? అంత లావుమనిష ఆమాత్రం కడవ ఎత్త లేడా?" వా.
ఒకపోకకు గైకొనక
- లెక్క చేయక.
- "నా దెస మోహ మంతయున్, బొచ్చెము చేసి నన్ను నొక పోకకు గైకొన కివ్విధంబునన్." రుక్మాం. 4. 53.
- ఒకపోకం తైనా లెక్క చేయక అనుట.
ఒక ప్రసంగ మై
- ప్రసంగ వశాత్తుగా.
- "అజుడె యొక ప్రసంగ మై చెప్ప వింటి..." ప్రభా. 2. 99.
ఒక ప్రొద్దున
- చాలా చీకటి ఉండగానే.
- "ఒకప్రొద్దున లేచి చేలోకి పోతే వీడి పశువులు సిద్ధం." వా.
- "ఓ పొద్దున లేచి వెళ్ళాడు." వా.
ఒకమాట చెప్పు
- సూచించు. సూచనగా ఏదో అను.
- "ఒకమాట నాకు జెప్పక పోయితివి గాక, సకలదైత్యుల దున్మి జానకిని దేనె?" సుగ్రీ. పు. 30.
- "నువ్వు ఒకమాట చెప్పి ఉంటే నేను వాడి సంగతి చెప్పి ఉండేవాణ్ణి." వా.
ఒకమాట చేయు
- ఒక యేర్పాటు చేయు.