ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఒక____ఒక 300 ఒక____ఒక
- "అతడు మనము నొకడు మో,చిన మో పిందఱు మోచిన, యనువుననీతోడుపడుట యతనికి గీడే." ఉ. హరి. 5. 304.
ఒక డొకని మొగంబు గానక
- ఎవరికి వారుగా.
- "వికలగతి నున్న రాక్షసు, లొక డొకని మొగంబు గాన కూరక చనిరి..." ఉ. హరి. 4. 270.
- "ఒకరిమొగం ఒకరు చూచుకోకుండా దేశాని కొకర మయి పొయ్యాము." వా.
ఒక తల
- ఒక యెత్తు.
- "సకలైశ్వర్య సమృద్ధులు, నొకతల సంతానలాభ మొకతల." కాశీ. 3. 216.
ఒక తాటిమీద నడచు
- ఏ కాభిప్రాయముతో మెలగు.
- "మన మంతా ఒక తాటిమీద నడిస్తే మనల్ని ఏ అధికారీ ఏమీ చేయ లేడు." వా.
- చూ. ఒకతాట్ల్మీద నిలుచు.
ఏకాభిప్రాయముతో నుండు.
- "ఒకతాటిమీద నిలుస్తా మంటేనే నే నిందులో దిగుతాను. లేకపోతే నాపాటికి నేను పోతాను." వా.
- చూ. ఒక తాటిమీద నడచు.
ఒక తెవలె ఆడి ఆడించు కొనుట
- వాళ్లూ వీళ్ల లాగా ఇతరులను అనడం, ఇతరులతో అనిపించుకోవడం.
- "ఒకతెవలె వాడి యాడించుకొనుటకే యిరుగు పొరుగు చూచె నొకో యుప్పకు జప్పకు గా నను జూచున్." నిరంకు. 2. 59.
- "దాని దీనిలాగా నేను నాలు గని అనిపించుకోవడం మీ రెప్పు డైనా చూచారా?" వా.
- "ఒకరివలె అనడం అనిపించుకోవడం నా కలవాటు లేదు." వా.
ఒకదారికి తెచ్చు
- సరి అయిన మార్గంలో నడచుస్థితికి తెచ్చు.
- "ఈ పిల్లను ఒక దారికి తెచ్చేభారం అంతా నీదే అన్నయ్యా! మాకు వేరే దక్షత యే ముంది?" వా.
- "ఈ వ్యాజ్యం ఒకదారికి తెచ్చేబాధ్యత నీది. అస లిందులో నన్ను దింపింది నీవు." వా.
ఒక దెబ్బ తీయు
- ఒక ఊపు ఊపు.
- "ఒక దెబ్బ తీయగా జాలుదురు." విజయ. 1. 75.
- "తలచుకొంటే మీ అన్నే మీ మామను ఒక దెబ్బ తీయగలడు. నే నేం చేయగలను?" వా.
ఒకని బట్టి పదుగురుగా
- ఆజ్ఞాపింపగనే గుంపులు గుంపులుగా వచ్చు.
- "ఉద్దవిడి రమ్మనిన భృత్యు లొకనిబట్టి పదుగు రత్తఱి బడిబడి బాఱుతెంచి." సారం. 1. 115.
ఒక నుడుగు అను
- పాటలో ఒక చరణము పాడు.
- "పెండ్లి పందిట్లో ఒకనుడుగు అనరాదషే." హేమా. పు. 81.