ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఒండొ____ఒక 296 ఒక____ఒక
- "రాజవిరహంబున నొండొకరీతి బ్రొద్దు గడపుచున్నంత..." హంస. 2. 2.
ఒండొరుల మోములు చూచుకొను
- ఏదైనా జరిగినప్పుడు గట్టిగా మాట్లాడు అవకాశము లేక పోగా పరస్పర ముఖావలోకనంతోనే తమభావములను సూచించు.
- "పువ్వుబోం డ్లొయ్యన దవ్వుగా నరిగి రొండొరు మోములు చూచి యద్దిరా, యయ్యకు మన్మథాభ్యుదయ మంచు." కళా. 3. 37.
- "వాడు అంతమందిలో అసభ్య మయిన మాట అనగానే అక్కడ ఉన్నవా రందరూ ఒకరిమొగాలు ఒకరు చూచుకొన్నారు." వా.
- చూ. ఒకరిమొగా లొకరు చూచుకొను.
ఒక ఊపు ఊపి వదలు
- ఎదుటివాని సత్తా సారమును కదల్చి చూచు.
- "ఆ ఊళ్లోకి ఏ పండితుడు వచ్చినా అతను ఒక ఊపు ఊపి గానీ వదలడు." వా.
ఒకకంచాన తిని ఒకమంచాన పడుకొను
- అన్యోన్యముగా నుండు.
- "వాళ్లిద్దరూ చిన్న తనంనుంచీ ఒక కంచాన తిని ఒక మంచాన పడుకొన్న వాళ్లు." వా.
ఒక కంట కనిపెట్టు
- కొంత ప్రాపుగా రక్షగా ఉండు.
- "మీ రేదో ఒక కంట కనిపెట్టి ఉంటా రని కదా యీ ఊరు వచ్చాను." వా.
ఒక కంట పాలు ఒక కంట నెత్తురు కురియుగతి
- కరుణ, కోపము ఒక దాని వెంట ఒకటి వెల్లివిరియగా.
- "కరుణయు గోపము గనుగవ, నొరయగ నొకకంట బాలు నొక కంటను నె,త్తురు గురియుగతి." ఉ. హరి. 4. 59.
ఒక కంట బెల్లము ఒక కంట సున్నము
- పక్షపాతదృష్టి.
- "ఆ అత్తగారి కొక కంట బెల్లం, ఒక కంట సున్నం. చిన్న కోడల్ని నెత్తిన పెట్టుకొని పెద్దదాన్ని రాచి రంపాన పెడుతుంది." వా.
ఒక కన్ను వేసి వుంచు
- కాస్త కన్ను పెట్టి ఉండు.
- "వాడి కేదో కాస్త చెడ్డపే రుంది. ఎందు కైనా మంచిది. కాస్త కన్ను వేసి ఉంచు." వా.
ఒక కుతి కై యుండు
- ఏకాభిప్రాయముతో నుండు. ఒకటిగా నుండు.
- "ఒక కుతి కై యుండెడి మీ,రకటా! చెలియెడల నింత యతికూహకమా, పికమా శుకమా యిక మా,నక మాసుకుమారగాత్రి నాయమె యేచన్." అని. 3. 35.
ఒక కుత్తుక యగు
- 3. ఏకాభిప్రాయమునకు వచ్చు.