పుట:PadabhamdhaParijathamu.djvu/323

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఒక____ఒక 297 ఒక____ఒక

 • "...కొమరు సెట్టియు బోటియు నొక్క కుత్తు కై..." బసవ. 4. 156.
 • 2. ఏకకంఠంతో ఉండు. ఒకే మాటమీద ఉండు అనుట.
 • "ఆలు మగడును నొకకుత్తు కైన గాక, యిట్టి ధర్మంబు మిన్నక యేల కలుగు?" హర. 2. 60.

ఒక కొందఱము

 • ఈ 'ఒక' రకరకాల అర్థచ్ఛాయలలో ప్రయుక్త మవుతుంది. ఒకొక్కసారి కేవలం వాక్యోప స్కారమే అవుతుంది.
 • "ఏ మొక కొందఱము మహా, గ్రామ వనాంతరము లెల్ల గడచి..." విక్ర. 5. 201.
 • "విశ్వావసుండు మొదలుగ వీణాధరుల మొక కొందఱము తత్పరతయు భక్తియు దలిర్ప..." కళా. 2. 71.
 • "ఒక నల్గురు వస్తే చాలు." వా.
 • "అదీ ఒక గొప్పే!" వా.
 • "ఒక కొంత యోచించి." వా.
 • చూ. ఒక కొందఱు.

ఒక కొలికికి వచ్చు

 • ఒక దారికి వచ్చు. దండలలో కొలికిపూస ఉంటుంది. తద్వారా ఒక వరుసకు వచ్చు అని మారి ఏర్పడినది.
 • "జలరుహదళములు చిలుకల, కొలికిం గనుగొన్న నొక్కకొలికికి వచ్చున్." విప్రనా. 2. 44.
 • "ఏదో ఈ వ్యవహారం ఒక కొలికికి వచ్చాక గానీ నేనీ ఊరు వదల దలచుకోలేదు." వా.

ఒక కోడి కూయుపల్లె

 • చిన్న పల్లె.
 • "తిర మనుచు దేవళంబుల, బరగగ నొక కోడి గూయుపల్లియ నైనన్." విప్రనా. 1. 60.

ఒక గరిడిలో చేసిన సామే

 • ఒకచోట నేర్చిన విద్యయే.
 • "ఒదుగుసేత లివేల పద యదే మన మొక్క, గరిడి సేసినసామె కదె లతాంగి." చంద్రాం. 6. 135.

ఒకగాడి కట్టు

 • కూడనివానిని ఒకచోట చేర్చుపట్ల ఉపయోగించె పలుకుబడి.
 • "బంధ మోక్షము లొక్క గాడి గట్టుట తెలివి గానకే కదా!" తాళ్ల. సం. 11. 2. భా. 16.
 • "గాడిదనూ గుఱ్ఱాన్నీ ఒక గాడిలో కడతా నంటే ఎట్లా? అత నేమో సున్నిత మైన మనిషి. వీ డేమో వట్టి మోటువాడు." వా.

ఒక గుడ్డు మునికిబోయిన నేమి?

 • అందరిలో ఒకడు పోతే నేమి? అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "కులమునకు గొప్ప గుద్దలి, ఖలుడు కులాంగారకంబు కష్టుడు వీనిం, బొలి యింపుడు ఘనశస్త్రం, బుల వెస నొక గుడ్డు మునికిబో నేమి యగున్." నృసిం. 4. 25.