పుట:PadabhamdhaParijathamu.djvu/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏపా____ఏపు 284 ఏపు____ఏప్రొ

పెట్టానో కానీ, ఎంత డబ్బు ఎదురు పెట్టినా పూర్తి కావడం లేదు." వా. ఏ పాప మెఱుగని

  • అమాయక మైన, నిర్దోషి అయిన.
  • "పాదముల వ్రాలి నే నేమి పాప మెఱుగ, నీ మహాదేవునాన పూర్ణేందు వదన!" శుక. 1. 543.
  • "ఏనాటి కేపాప మెఱుగని కన్నుల, కిడియె గాటుక రేఖ లేపు గులుక." హంస. 3. 75.

ఏపారు

  • వర్ధిల్లు; ఒప్పు.
  • "ఏపారిరుర్విజనుల్." సింహా. 12. 111.
  • "భూలోకదేవేంద్రుపగిది నేపారి, యున్నచో." రం. రా. బాల. పు. 4. పం. 2.

ఏ పుట్టలో ఏ పా ముందో?

  • పైకి కనిపించక పోయినా ఎవరిలో ఎంత పాండిత్యం ఉందో? ఎవరిలో ఏం గుణాలు ఉన్నయో? ఎలా తెలుస్తుంది అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "చూడ్డానికి అమాయకంగానే ఉన్నా డనుకో. అయినా ఏ పుట్టలో ఏ పాముందో?" వా.

ఏపు మాపు

  • నశింప జేయు. రూపు మాపు లాంటిది. హర. 7. 154.

ఏపుమాపు సేయు

  • నశింప జేయు.
  • "మరు బాణముల నేపు మాపు సేయగ నోపు." రుక్మాం. 2. 125.

ఏపు మాయించు

  • గర్వ మడచు.
  • "పదవిని దండ్రిచే బలిమిని గొన్న, యెదిరిని కంసుని యేపు మాయించి."ద్విప. మధు. 4.

ఏపు మిగులు

  • ఎక్కు వగు.
  • "వ్యాఘ్రాదు లైనక్రవ్యాద హింస్ర మృగంబు, లెచ్చోట జూచిన నేపు మిగిలె." కాశీ. 5. 268.

ఏపు మీఱు

  • ఒప్పు.
  • "రామాయణ ద్విపద యేపు మీఱంగ, రచియింపుము." వర. రా. బా. పు. 5. పంక్తి. 20.

ఏపు రేగు

  • 1. విజృంభించు.
  • "ఏలికలు వెంట వెస నంట నేపు రేగి." శుక. 1. 259.
  • 2. రెచ్చిపోవు; చెల రేగు.
  • "ఇటుల మద మెత్తి తమచేత నేపు రేగి." హంస. 2. 195.
  • "ఎగయు ధర ద్రవ్వు బొఱియగా నేపురేగి...పంది మెల్లన రణపరిపంథి యగుచు." భాగ. స్క. 3. 637.
  • "దుష్ట సత్వముల్, ధారుణి నేపురేగి బెడిదంబుగ మూకలు గట్టి గ్రామముల్, మారి మసంగిన ట్లయి సమస్తము జూర్ణము చేసినప్పుడు." రుక్మాం. 3. 79.

ఏ ప్రొద్దు

  • ఎల్లప్పుడు, ప్రతిదినం.