పుట:PadabhamdhaParijathamu.djvu/311

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఏబ్ర____ఏమం 285 ఏమ_____ఏమ

 • "అనగ నే ప్రొద్దు గుణముల నతిశయిల్లి." శివ. 1. 18.
 • "జగతి గళావతిసంజ్ఞ నొప్పెడివీణె, తోడ నేప్రొద్దును దుంబురుండు..." కళా. 2. 63.

ఏ బ్రతికితిని

 • ఇక పరవాలేదు అన్న అర్థంలో ఉపయోగించే పలుకుబడి. వాడుకలో 'అబ్బ! బతికి పోయాను (పోతిని)' అని వ్యవహారం.
 • "అని అనియు ననక మునుపే, యనఘా! యే బ్రతికితిని మదన్వయ మిది పా,వన మయ్యె ననుచు..." శుక. 2. 165.
 • ఈ అర్థంలోనే కాక తప్పించుకొని పోతిని అన్న అర్థంలో - నేనా రోజు అక్కడ లేను. నువ్వు బతికిపోయావు - అని కూడా మధ్యమ పురుషలో వ్యవహరిస్తారు.

ఏబ్రాసి

 • వెధవ. ఒక తిట్టు.
 • చూ. ఏభ్య రాశి.

ఏభ్యరాశి

 • ఏబ్రాసి.
 • "ఈ క్రూరకర్మున కీ యేభ్యరాశికి." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 828.
 • చూ. ఏబ్రాసి.

ఏ మంటే యే మవుతుందో!

 • ఏదైనా అనవలసినప్పుడు ఫలితమునుగూర్చి శంకించుటను తెలుపుపలుకుబడి.
 • "ఎద్ది యాడ బోవంగ నెట్లౌనొ యనుచు బలికె." కశా. 5. 108.
 • "పెద్దవాళ్లతో పని. ఏ మంటే ఏ మవుతుందో! మౌనంగా ఉండడమే మంచిది." వా.

ఏ మన నో రున్నది?

 • నే నేమీ అనలేదు. నే నే మనుటకూ ఆస్కారం లే దనుట.
 • "అన నయ్యంగన నా కేమన నో రున్న యది..." కళా. 3. 191.
 • "వాడు మంచివా డని చెప్పి నేనే పంపించాను. వా డేమో నీకు చెడుపు చేశాడు. నీవు తీసి వేశావు. ఏ మనడానికి నాకు నో రుంది?" వా.

ఏ మని చెప్పుదును?

 • వర్ణింప నలవి కా దనుట.
 • "అమ్మా! ఏమని చెప్పుదు." పారి. 1. 75.
 • "పట్టనం బెంత కృతార్థతం బొరసె, నేమని చెప్ప మదీయభాగ్యముల్." కా. మా. 4. 199.

ఏ మన్నా పడవలసిందే

 • తల ఒగ్గి ఉండక తప్ప దనుట.

("మీ కింద నౌకరీ చేసుకోవడానికి వచ్చాను. మీ రేమన్నా పడవలసిందే." వా. ఏమఱించు

 • మోసగించు. ఇది నేడు దక్షిణాంధ్రసీమలో వాడుకలో ఉన్నది. "వాడు నన్ను ఏమార్చినాడు."
 • అఱవం - ఏమాట్రం. పండితా. ద్వితీ. మహి. పుట. 215.