పుట:PadabhamdhaParijathamu.djvu/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనె_____ఏపా 283 ఏపా____ఏపా

ఏ నెక్కడ తా నెక్కడ ?

  • నడుమ తారతమ్య మెక్కువ యనుట.
  • "ఏ నెక్కడ తా నెక్కడ, ఏ నెక్కెడునట్టి పట్ట పేనుగు నెక్కన్." ఇరావతచరిత్ర.
  • "నే నెక్కడ వాడెక్కడ! నాతో పోటీకి వస్తాడా ?" వా.

ఏ నెక్కడ నీ వెక్కడ ?

  • మన మధ్య తారతమ్య మెక్కువ యనుట.
  • "ఏ నెక్కడ నీ వెక్కడ, మానవ సామాన్యు డనుచు మదమున నెఱుగం, గా నేరక..." హరి. 3. 99.
  • "నే నెక్కడ బ్నీ వెక్కడ ? నాతో వాదు పెట్టుకొంటావా ?" వా.

ఏ నోరు పెట్టుకొని

  • ఏ ముఖం పెట్టుకొని - మాటలాడగలం ? అన్న పట్లనే ఉపయుక్త మవుతుంది.
  • "...ఇంతలేసి సంసారచ్ఛేదంబులు మన యూరి పుణ్యాత్ములవలననే కదా యయ్యె నింక నే నోరు పెట్టుకొని మాటలాడుద మనువారును..." ఉ. రా. 6. 343.

ఏ పనికిని బొడ్డు వంచకుండు

  • ఏ పనికీ పూనుకొనక పోవు.
  • "...ఏ పని కైనను బొడ్డు వంప లేదు..." భోజ. 6. 142.
  • "వాడు ఏపనికీ బొడ్డు వంచ లేడు. వా డేం పనికి వస్తాడు?" వా.

ఏ పాకము పొందకుండ

  • పదిలము తప్పకుండ.
  • "తపస్వి చిత్తం బేపాకంబునుం బొందకుండ." హర. 2. 128.
  • ఈక్రింది భావచ్ఛాయలలో ఇది అటూ యిటూ మారుతూ ఉంటుంది.
  • పాకము - పరిపక్వస్థితికి దగ్గఱగా ఉన్నది.
  • "వాని మనసు ఏపాకాన ఉందో యేమో! నామాట కంగీకరించాడు. నిజానికి వాడు బ్రహ్మ చెప్పినా వినే వాడు కాదు." వా.
  • "వాడి మనస్సు మంచి పాకాన ఉన్నప్పుడే ఈపని కాస్తా సరి చేసుకో."
  • "ఏమిటి? అలా కసురుకుంటావు? నీ మనసు ఏ పాకాన ఉం దేమిటి?" వా.

ఏపాటి

  • (అది) ఎంత ? కాశీ. 7. 129.
  • "వాడికి పదిరూపాయలు విరాళ మివ్వడం ఏపాటి?" వా.

ఏ పాపపువేళ చూచితినో?

  • ఏ దుర్ముహూర్తంలో చూచానో?
  • ఏ దైనా పని జరిగిన తర్వాత దుష్ఫలిత మేర్పడగా అను మాట. కొన్ని వేళల్లో చేసిన పనికి దుష్ఫలితము తప్ప దన్న జ్యోతిశ్శాస్త్ర విశ్వాసంపై ఏర్పడిన పలుకుబడి.
  • "నీపై కోరికె మరల్చి నిధిపతిసుతు నే పాపపు వేళను జూచితినో..." కళా. 4. 23.
  • "ఈ పని ఏ పాపపు వేళ మొదలు