ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉప్ప____ఉప్ప 214 ఉప్ప____ఉప్ప
- "ఇప్పుడు పిల్లవా డని ఉపేక్ష చేస్తే తర్వాత తర్వాత విచారింపవలసి వస్తుంది." వా.
ఉప్పకు చప్పకుగా చూచు
- అలక్ష్యముగా చూచు, సర్వ సామాన్యంగా చూచు.
- "ఒకతెవలె వాడి యాడిం, చుకొనుట నే యిరుగు పొరుగు చూ చెనొకో యు,ప్పకు జప్పకుగా నను జూ,చుక నడువగవలె." నిరంకు. 2. 59.
- చూ. ఉప్పచప్పగా ఉండు.
ఉప్పచప్పగా ఉండు
- అంత రుచిగా లేక సర్వసాధారణంగా ఉండు. పైది వాడుకలో ఉప్పచప్పగా, ఉప్పన చప్పగా అని మారింది. భావచ్ఛాయ కూడా మారింది. 'ఏదో చాలాసేపు పాడాడు కాని ఉప్పచప్పగా ఉంది' అంటే అంత ప్రత్యేకత లేదని భావం.
- "ఏదో ఉప్పచప్పగా ఉంది నాటకం." వా.
ఉప్పని చప్పని
- రుచి లేని; ఉప్ప చప్పగా ఉన్న.
- "ఊరును బేరు లేని యొక యుప్పని చప్పనికావ్య మల్లు." బుద్ధ. 1. 12.
- చూ. ఉప్పచప్పగా ఉండు.
ఉప్పనపట్టె లాడు, ఆడించు
- ఒకరక మైనఆట ఆడు. ఉప్పుపట్టీలు, ఉప్పరపట్టెలు ఇవే.
- "పడతి! నీచూపు లుప్పనపట్టె లాడించి చెలులవక్త్రముల బూజించు గాక." ఉ. హరి. 5. 141.
ఉప్పరగుళ్లు
- ఒక బాలక్రీడ.
- పండితా. ద్వితీ. మహి. పుట. 179.
ఉప్పరపట్టెలు
- చూ. ఉప్పనపట్టె లాడు.
ఉప్పరము దాటు
- ఆకాశ మంటు; వ్యాపించు.
- "అంటిన గందునో యను మేనినును గాంతి, యిరుగెలంకులకు నుప్పరము దాటు." విక్ర. 8. 101.
ఉప్పర మెగయు
- ముమ్మర మగు; మిన్ను ముట్టు.
- "అప్పలుకుల కలుకలు మది నుప్పర మెగయంగ." ఉ. హరి. 5. 220.
- చూ. ఉప్పరము దాటు.
ఉప్పరవట్టములు
- పైన వేసే మేలుకట్లు, చాందినీలు. అలంకారార్థం పట్టణాలలో దేవాద్యుత్సవాలలో అక్కడక్కడా చతురస్రంగా స్తంభాలు నాటి, వాటిపైన చాందినీలు కట్టి అలంకరిస్తారు. నగరము నలంకరించుటకు దారిప్రక్క నెత్తుగా కట్టు