పుట:PadabhamdhaParijathamu.djvu/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉప్ప____ఉప్ప 214 ఉప్ప____ఉప్ప

 • "ఇప్పుడు పిల్లవా డని ఉపేక్ష చేస్తే తర్వాత తర్వాత విచారింపవలసి వస్తుంది." వా.

ఉప్పకు చప్పకుగా చూచు

 • అలక్ష్యముగా చూచు, సర్వ సామాన్యంగా చూచు.
 • "ఒకతెవలె వాడి యాడిం, చుకొనుట నే యిరుగు పొరుగు చూ చెనొకో యు,ప్పకు జప్పకుగా నను జూ,చుక నడువగవలె." నిరంకు. 2. 59.
 • చూ. ఉప్పచప్పగా ఉండు.

ఉప్పచప్పగా ఉండు

 • అంత రుచిగా లేక సర్వసాధారణంగా ఉండు. పైది వాడుకలో ఉప్పచప్పగా, ఉప్పన చప్పగా అని మారింది. భావచ్ఛాయ కూడా మారింది. 'ఏదో చాలాసేపు పాడాడు కాని ఉప్పచప్పగా ఉంది' అంటే అంత ప్రత్యేకత లేదని భావం.
 • "ఏదో ఉప్పచప్పగా ఉంది నాటకం." వా.

ఉప్పని చప్పని

 • రుచి లేని; ఉప్ప చప్పగా ఉన్న.
 • "ఊరును బేరు లేని యొక యుప్పని చప్పనికావ్య మల్లు." బుద్ధ. 1. 12.
 • చూ. ఉప్పచప్పగా ఉండు.

ఉప్పనపట్టె లాడు, ఆడించు

 • ఒకరక మైనఆట ఆడు. ఉప్పుపట్టీలు, ఉప్పరపట్టెలు ఇవే.
 • "పడతి! నీచూపు లుప్పనపట్టె లాడించి చెలులవక్త్రముల బూజించు గాక." ఉ. హరి. 5. 141.

ఉప్పరగుళ్లు

 • ఒక బాలక్రీడ.
 • పండితా. ద్వితీ. మహి. పుట. 179.

ఉప్పరపట్టెలు

 • చూ. ఉప్పనపట్టె లాడు.

ఉప్పరము దాటు

 • ఆకాశ మంటు; వ్యాపించు.
 • "అంటిన గందునో యను మేనినును గాంతి, యిరుగెలంకులకు నుప్పరము దాటు." విక్ర. 8. 101.

ఉప్పర మెగయు

 • ముమ్మర మగు; మిన్ను ముట్టు.
 • "అప్పలుకుల కలుకలు మది నుప్పర మెగయంగ." ఉ. హరి. 5. 220.
 • చూ. ఉప్పరము దాటు.

ఉప్పరవట్టములు

 • పైన వేసే మేలుకట్లు, చాందినీలు. అలంకారార్థం పట్టణాలలో దేవాద్యుత్సవాలలో అక్కడక్కడా చతురస్రంగా స్తంభాలు నాటి, వాటిపైన చాందినీలు కట్టి అలంకరిస్తారు. నగరము నలంకరించుటకు దారిప్రక్క నెత్తుగా కట్టు