పుట:PadabhamdhaParijathamu.djvu/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉప్ప____ఉప్ప 215 ఉప్పి____ఉప్పు

ధ్వజాదిక మని వావిళ్ళనిఘంటువు.

  • పండితా. ద్వితీ. మహి. పుట. 179.

ఉప్పరవీది

  • ఆకాశమార్గము.
  • "తే రుప్పరవీది దోలుకొని." భార. భీష్మ. 2. 90.

ఉప్పరా లెగయు

  • మీది కెగయు; మిన్ను ముట్టు; అతిశయించు.
  • "గుప్పెడినిట్టూరుపుల గోమలి హారము లెల్ల, ఉప్పరా లెగయ జొచ్చె వోయమ్మా!" తాళ్ల. సం. 12. 327.

ఉప్పరిపెనమున నీరువలె

  • కుతకుతలాడు. పెనంమీద నీరు వేడెక్కి కళపెళ ఉడికి పోతుంది.
  • "వనరాసు లేడు నుప్పరి, పెనమున నీరమును బోలె బెల్లున నుడికెన్ (గెన్)..." కుమా. 6. 155.

ఉప్పరిసాహిత్యము

  • గొల్లనిసాహిత్యవిద్య వంటిది. ఆకాలంలో ఉప్పరివాళ్ల కేం చదువొస్తుంది అనుకునేభావం పై ఏర్పడింది.</big

ఉప్పవడ మగు

  • మేలుకొను.
  • "పవడించి యంతను,ప్పవడమగుచు." పరమ. 3. 56.
  • "ఉప్పవడము గావయ్యా ఉయ్యల మంచముమీద." తాళ్ల. 1. 62.
  • చూ. ఉపవడ మగు.

ఉప్పిండి

  • ఉప్పుపిండి. తమిళంలో ఉప్పుమావు.

ఉప్పిండి ఉపవాస ముండు

  • ఉప్పుపిండి మాత్రమే తిని ఉపవాస ముండు.
  • "ఓర్పుమై నుప్పిండి యుపవాసముండనీ, మగనాలి సరిపోల్ప దగదు విధవ." కాశీ. 2. 83.

ఉప్పిడి

  • ఉపవాసము. ఉప్పిండి ఉపవాసములో ఇది మాత్రమే మిగిలి ఉపవాసం అనే అర్థం తెలుపునదిగా మారినపలుకుబడి.
  • "పలుతెఱగుల నుప్పిడుల్ సలుప వలదు." అచ్చ. అయో. 54.

ఉప్పిడిపథ్యం

  • ఉప్పులేని పథ్యం. కొన్ని రోగాలకు, కొన్ని మందులకు ఉప్పు పులుసు తినకూడ దని వైద్యులు పథ్యం పెడతారు. ఆయుర్వేదం ద్వారా వచ్చిన పలుకుబడి.
  • చూ. చప్పిడి పథ్యం.

ఉప్పు ఉంటే ఊరగాయ ఉండదు

  • బొత్తిగా లేనిసంసారం అనుట.