పుట:PadabhamdhaParijathamu.djvu/242

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉప్పు____ఉప్పు 216 ఉప్పు____ఉప్పు

 • "వాళ్లింట్లో ఏముంది? ఉప్పు ఉంటే ఊరగాయ ఉండదు. ఊరగాయౌంటే ఉప్పు ఉండదు." వా.

ఉప్పుకు పత్రికి కాక పోవు

 • దేనికీ పనికి రాక పోవు.
 • "నేను చేసిం దంతా ఉప్పుకూ పత్రికి కాక పోయింది." వా.
 • "వాడు ఉప్పుకూ పత్రికి కాకుండా పోయినాడు." వా.

ఉప్పుకు వస్తుందా ఊరగాయకు వస్తుందా

 • దేనికీ పనికి రా దనుట.
 • "ఈ లేనిపోని మాటలతో లాభ మేముంది? ఉప్పు కొస్తుందా? ఊరగాయ కొస్తుందా?" వా.

ఉప్పుగండలు

 • ఉప్పులో ఊరవేసిన మాంసం ముక్కలు.
 • "ఉప్పుగండ లెండబెట్టినవిధమున్." కుమా. 11. 175.

ఉప్పుగండలు చేయు

 • ముక్కలు ముక్కలుగా నఱకు. ఉప్పులో ఊరవేయుటకై తగినంతచిన్నగా అనుట.
 • "దుప్పుల బడనేసి యుప్పగండలు చేసి, చప్పరించుచు నుండు జవులుమఱచి." వాల్మీ. 2. 129.

ఉప్పుగల్లు వోలెbig>

 • ఏకాకిగా; ఉప్పురాయివలె; లేక లేక ఒకడుగా.
 • "సుతుల్స్ నేడ్వురను మ్రింగితిని తోడ్తో నిల్చెం, గడపట నొక డుప్పుగల్లువోలె." జైమి. 4. 78.
 • "నా, కుప్పుగలువోలె గలిగిన, యిప్పాపని దీని కేడ యిచ్చితి మెసవన్." వేం. పంచ. 5. 25.
 • రూ. ఉప్పుగలువోలె.

ఉప్పుగాయ

 • ఊరగాయ.
 • "మీ గడల్ పెరుగు లుప్పుల గాయలున్." అని. 1. 105.
 • కన్నడం-ఉప్పుగాయ. ఉప్పిన గాయ. తమిళం-ఉప్పిక్కాయ్.

ఉప్పుగుండాలు

 • పిల్లల ఆట.

ఉప్పు చిదిమి యినుమడి యగు

 • పడిపోయి అధిక మగు. కొంత నష్ట మైనట్లు కనిపించినా, దానివల్ల మఱింత లాభము కలుగుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "బ్రాహ్మణ్యంబె కాక భాగవతశ్రీయునుం గలిగి యుప్పు చింది యినుమడి యగు చందంబునం..." ఆము. 7. 24.
 • చూ. ఉప్పొలికి ఇమ్మడి అయినట్లు.

ఉప్పుచేప

 • ఉప్పులో ఊరవేసిన చేప. హంస. 4. 187,

ఉప్పుటుండలు

 • ఆవిరితో చేసిన పిండివంట.
 • శ్రీ. రం. మా. 6. 110.