పుట:PadabhamdhaParijathamu.djvu/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉప___ఉప 213 ఉప___ఉపే

తీరుబడి ఉందా?' ఇత్యాదిగా మారుతుంది.

 • "మేము ఉన్నా మనైనా నీకు జ్ఞాపకం ఉందా? ఏమప్పా ఎట్లా ఉన్నారు? అని మాటవరుస కైనా అడిగేందుకు నీకు తీరుబాటు కాలేదే? ఇంత నీవు మమ్మల్ని ఏమి ఉద్ధరిస్తావు?" వా.

ఉపకార మెక్కించు

 • ఉపకారము చేయు.
 • "మీచేత వెళ్ల నాడించుకొని మీ కుపకారం బెక్కించి విడుచుటకు వచ్చినదని." ప్రభా. 4. 31.

ఉపగ్రామాలు

 • శివారుగ్రామాలు.
 • "బస్తీ దక్షిణము తిరువల్లిక్కేణి... మొదలయిన కొన్ని ఉపగ్రామాలు ఉన్నవి." కాశీయా. 372.

ఉపదర్శన మాచరించు

 • పెత్తనము చేయు; ఏదైనా పనిని పర్యవేక్షించు.
 • "త్రిపురాంతకు బిలిపింపక, యుపదర్శన మాచరించు టుచితమె హరికిన్." కాశీ. 7. 58.

ఉపదేశము చేయు

 • మంత్రమును ఉపదేశించు, హితము చెప్పు.
 • "స్వాములవారు అతనికి బాలాత్రిపురసుందరీ మంత్రం ఉపదేశం చేశారట!" వా.
 • "నీ వేం ఉపదేశం చేసి పంపావో? కాస్త ఈమధ్య నీ అల్లుడు పొదుపుగా ఉంటున్నాడు." వా.

ఉపనయనము

 • వడుగు. పంచదేశ సంస్కారాలలో ఒకటి.

ఉపనయనమునాటి మాట

 • యాచన, భిక్ష మెత్తుట. ఉపనయనంలో 'భవతి భిక్షాం దేహి' అని మూడుసార్లు భిక్షం ఎత్తించుటపై యేర్పడినపలుకుబడి.
 • "ఎవడూ అన్నం పెట్టక పోతే ఉపనయనమునాటి మాట ఉండనే ఉంది." వా.

ఉపరిరతి

 • రతివిశేషములలో భేదము.
 • కుమా. 9. 152.

ఉపవడ మగు

 • మేలుకొను.
 • "పువ్వారుబోణి మదిలో, నివ్వెఱపడి చూచుచుండ నృపు డుపవడ మై." శుక. 1. 313.

ఉపవాసము చేయు

 • ఒక్కప్రొద్దు ఉండు.
 • "ప్రతి శివరాత్రికీ అతను ఉపవాసం చేస్తాడు." వా.

ఉపాదాన మెత్తు

 • బిచ్చ మెత్తు.
 • "తలమీద మంత్రాక్షతము లుంచి కలకాపు, టిండ్ల నుపాదాన మెత్తి యెత్తి." హంస. 2. 152. పు.

ఉపేక్ష చేయు

 • ఉదాసీనముగా చూచు.
 • "ఈ సుకుమారదేహు డిపు డీవని నుండ నుపేక్ష చేసినం, దోసము వచ్చు..." శుక. 1. 282.