ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇరు_____ఇర్గా 164 ఇఱి_____ఇఱు
- "ఇరుకెలంకులను కనుగల్గి దిక్కులు కలయ గన్గొనుచు." వర. రా. కిష్కి. పు. 286. పంక్తి 16.
ఇరు లన్న నో యనియెడు తమిస్ర
- కటికచీకటి.
- పిలిస్తే పలికే దనుటలో కావలసినంత ఉన్నది అనేభావం సూచితము.
- "మరులుదీగ మెట్టి యిరు లన్న వో యని యెడితమిస్ర గాడుపడి." ఆము. 6. 12.
- చూ. పిలిస్తే పలుకు.
ఇరు సెవి యెఱుగకుండా
- రెండవచెవికి తెలియ నీయ కుండా - ఇతరుల కెవరికీ తెలియకుండ రహస్యముగా అనుట.
- "ఇరు సెవి యెఱు గక యుండం, దరుణీసుఖ మనుభవింప దలచిన." ఉ. హరి. 5. 197.
- రూ. ఇరు చెవి యెఱుగ కుండా.
ఇర్గాలిపసులు
- ద్విపాదపశువులు.
- మనుష్యులను నిందించుటలో అనుమాట. కాళ్ళసంఖ్యలో భేదమే కాని పశుసమానులే అనుట.
- "ఇర్గాలి పసు లగుగౌళతాపసులు నిందింప." పండితా. ప్రథ. పురా. పుట. 389.
- చూ. ఇరుగాలిపసులు.
ఇఱియుకౌగిలి
- బిగికౌగిలి.
- "ఎదురొత్తగా నేర్పె నిఱియుకౌగిటి యందు." కవిక. 3. 226.
ఇఱుకటమున బడు
- చిక్కుకొను ; ఇఱుకులో పడు.
- "పెనుసందడిలో నిఱుకటమున బడ్డనృపతి." నైష. 4. 124.
ఇఱుకటములు
- తిప్పుడుమాటలు.
- "ఈ యిఱుకటములు మాని, లేదు బొంకితి నని లెమ్ము." ద్వి. హరిశ్చ. పూ. 140214.
ఇఱుకాటము
- స్థలము చాలమి.
- "ఇల్లు ఇఱుకాటంగా ఉంది." వా.
- "అక్కడ దారి యిఱుకాటంగా ఉంది." వా.
ఇఱుకాటంలో పడు
- చూ. ఇఱుకులో పడు.
ఇఱుకున పడు
- ఎటూ చెప్ప లేనిస్థితిలో పడు.
- "వాడు వాణ్ణి ఎదుట ఉంచుకొని నన్ను నిలదీసి అడిగేటప్పటికి కాస్త యిఱుకున పడ్డాను." వా.
ఇఱుకుమ్రాను
- తోటలకూ దొడ్లకూ చుట్టూ ముళ్లకంచె వేసి దారిలో ఒక యిఱుకుమాను నాటుతారు. అది పంగలకొయ్య. మనిషి పట్టడానికి తగినంత సందే అందులో ఉంటుంది. దానిని