పుట:PadabhamdhaParijathamu.djvu/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరు_____ఇర్గా 164 ఇఱి_____ఇఱు

  • "ఇరుకెలంకులను కనుగల్గి దిక్కులు కలయ గన్గొనుచు." వర. రా. కిష్కి. పు. 286. పంక్తి 16.

ఇరు లన్న నో యనియెడు తమిస్ర

  • కటికచీకటి.
  • పిలిస్తే పలికే దనుటలో కావలసినంత ఉన్నది అనేభావం సూచితము.
  • "మరులుదీగ మెట్టి యిరు లన్న వో యని యెడితమిస్ర గాడుపడి." ఆము. 6. 12.
  • చూ. పిలిస్తే పలుకు.

ఇరు సెవి యెఱుగకుండా

  • రెండవచెవికి తెలియ నీయ కుండా - ఇతరుల కెవరికీ తెలియకుండ రహస్యముగా అనుట.
  • "ఇరు సెవి యెఱు గక యుండం, దరుణీసుఖ మనుభవింప దలచిన." ఉ. హరి. 5. 197.
  • రూ. ఇరు చెవి యెఱుగ కుండా.

ఇర్గాలిపసులు

  • ద్విపాదపశువులు.
  • మనుష్యులను నిందించుటలో అనుమాట. కాళ్ళసంఖ్యలో భేదమే కాని పశుసమానులే అనుట.
  • "ఇర్గాలి పసు లగుగౌళతాపసులు నిందింప." పండితా. ప్రథ. పురా. పుట. 389.
  • చూ. ఇరుగాలిపసులు.

ఇఱియుకౌగిలి

  • బిగికౌగిలి.
  • "ఎదురొత్తగా నేర్పె నిఱియుకౌగిటి యందు." కవిక. 3. 226.

ఇఱుకటమున బడు

  • చిక్కుకొను ; ఇఱుకులో పడు.
  • "పెనుసందడిలో నిఱుకటమున బడ్డనృపతి." నైష. 4. 124.

ఇఱుకటములు

  • తిప్పుడుమాటలు.
  • "ఈ యిఱుకటములు మాని, లేదు బొంకితి నని లెమ్ము." ద్వి. హరిశ్చ. పూ. 140214.

ఇఱుకాటము

  • స్థలము చాలమి.
  • "ఇల్లు ఇఱుకాటంగా ఉంది." వా.
  • "అక్కడ దారి యిఱుకాటంగా ఉంది." వా.

ఇఱుకాటంలో పడు

  • చూ. ఇఱుకులో పడు.

ఇఱుకున పడు

  • ఎటూ చెప్ప లేనిస్థితిలో పడు.
  • "వాడు వాణ్ణి ఎదుట ఉంచుకొని నన్ను నిలదీసి అడిగేటప్పటికి కాస్త యిఱుకున పడ్డాను." వా.

ఇఱుకుమ్రాను

  • తోటలకూ దొడ్లకూ చుట్టూ ముళ్లకంచె వేసి దారిలో ఒక యిఱుకుమాను నాటుతారు. అది పంగలకొయ్య. మనిషి పట్టడానికి తగినంత సందే అందులో ఉంటుంది. దానిని