ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇగు____ఇగు 150 ఇగు____ఇగ్రు
- "తగిలించుకొన్న పిమ్మట, నిగిలించుటె కాని కార్య మే మున్నది? శుక. 3. 78.
- చూ. ఇకిలించు.
ఇగురబెట్టు
- (అన్నము) ఉడకబెట్టు.
- "అన్నం ఇగరబెట్టడం అన్నా రావాలి గదా అంత పెద్దపిల్లకు." వా.
- 'ఇగుర' ఇగరగా వినవస్తుంది.
ఇగురవేయు
- వండు.
- "రాత్రికి నాలుగుగింజలు ఇగర వేస్తే పోతుంది. ఉన్న పచ్చడితో ఏదో యింత తింటాము." వా.
ఇగురుకూర
- పొడికూర, వేంపుడు, తాళింపు.
- తాళింపు వేసి వండినకూరను ఒక్కొక్క వేపూ, ఒక్కొక్క వర్గంవారూ పై పేళ్లలో ఏదో ఒకదానితో వ్యవహరిస్తారు. కూర చేర్చకనే ఇగురు అనీ అనడం కద్దు.
ఇగురుకొను
- ఇగురొత్తు.
- చూ. ఇగురొత్తు.
ఇగురువంటకము
- సరెసురు పెట్టి అనగా అత్తెసరు పెట్టి వండిన అన్నము.
- చూ. ఇగుర వేయు.
ఇగురొత్తు
- కలుగు.
- "మోద మిగురొత్త బాదాబ్జములకు మ్రొక్కి." రుక్మా. 1. 29.
ఇగుర్కొను
- చూ. ఇగురుకొను.
ఇగో
- ఇదిగో.
- "వీడి గో గుఱ్ఱపుదొంగ వచ్చె." జైమి. 3. 114.
- "ఇగో ఈ రెండు రూపాయలూ ఇప్పుడు తీసుకో. తర్వాత చూద్దాం." వా.
ఇగ్గులాడు
- లాగు, పట్టుక వేలాడు, పెనగులాడు, పీకులాడు.
- కొంచెం అసంతృప్తిని తెలుపుతూ అనేమాట. 'నన్ను పట్టుకొని యిగ్గు లాడితే యేమి లాభం ఉంది? ఇంక ఎవరి నైనా ధనవంతుల నాశ్రయించు' ఇలా రాయలసీమలో విరివిగా వినవస్తుంది.
- "ఏదో దీన్ని పట్టుకొని ఇగ్గులాడు తున్నాను. ఏ మవుతుందో ఏమో." వా.
- "ఏదో వాణ్ణి నేను పట్టుకొని ఇగ్గులాడడం తప్పితే వాడికి ఏ మైనా నాపైన ఉందా?" వా.
ఇగ్రుచు
- ఇగురొత్తు.
- "ఇగ్రుచుకోర్కుల దనడెంద మివతళింప." కవిక. 3. 222.
- శివరాత్రి. 2. 39.
- చూ. ఇగురొత్తు.