ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇక్క____ఇక్కు 149 ఇక్కు____ఇగి
ఇక్కడ పుల్ల అక్కడ పెట్టడు
- ఏమాత్రం వంగి పని చెయ్యడు అనుట.
- స్త్రీలింగంలోనూ ఇదే 'పెట్టదు' అని ఉంటుంది.
- "వాడు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టడు. మరీ వేళకు అన్నీ కావాలి." వా.
- చూ. అక్కడ పుల్ల ఇక్కడ పెట్టదు.
ఇక్క డున్నట్టుగా
- వెంటనే.
- కొత్త. 51.
- "ఇక్కడున్నట్టుగా రావాలి." వా.
ఇక్కన్ను
- రెండుకన్నులు.
- "ఇక్కంటితో నొక్క యింతి యే తెంచె." బస. 3. 18 పు.
ఇక్కపట్టు
- ఉనికిపట్టు.
- "క్రొక్కాఱు మెఱుగుల యిక్క ప ట్టిది." కుమా. 3. 18.
ఇక్కలువడు
- కదలిపోవు.
- "ఒండొంటిం దా కురభసంబున నిక్కలువడ గ్రుక్కుం ద్రొక్కుచు మెండు చెడి బెండువడి." భాగ. 8. 55.
ఇక్కిలి దక్కి
- విరివి యై, లా వెక్కి.
- "ఇక్కిలి దక్కి నిక్కి మెఱు గెక్కి.... తగునీచనుదోయి." మల్హ. 3. 101.
ఇక్కుపాటు
- కష్టము, ఇక్కట్టు.
- "నీ కిట్టి యిక్కుపాటు గల్గెనే తండ్రి యనుచు." రంగ. రా. సుందరా. 436.
ఇక్కువ లంటు
- కళ లంటు.
- "ఇక్కువ లంట.." నీలా. 3. 94.
ఇక్ష్వాకులనాటిది
- చాలా ప్రాచీనము ; తాతల నాటిది.
- వ్యంగ్యంగా కూడా ఇదిచాలా పాతపడింది అనే అర్థంలో ఉపయోగిస్తారు.
- ఇక్ష్వాకులు మనకు చాలా ప్రాచీనపాలకులు. అందుపై వచ్చినది.
- "బోటి యద్ది యిక్ష్వాకులనాటి దౌర." పాణి. 2. 104.
- "ఆ సిద్ధాంతం ఇక్ష్వాకులనాటిది. ఇప్పుడేమి పనికి వస్తుంది? వా.
- "అదంతా యిక్ష్వాకులనాటి మాట లే. ఇప్పటి సంగతి చెప్పు." వా.
ఇగిరించు
- 1. చిగుర్చు.
- "...వీణాదండము చిగిరించె నా." రాజ. చ. 1. 4.
- 2. ఎఱ్ఱబడు.
- "అనుమ డలిగి మొగ మిగిరింపన్." యయాతి. 3. 25.
- 3. ఇంకించు.
- "పయోధినాథజీవన మిగిరించి." పద్మ. 7. 39.
ఇగిలించు
- పం డ్లిగిలించు.