ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇంత_____ఇంతా 145 ఇంతి_____ఇంతి
- వాడుకలో చాలా రకాలుగా వినవస్తుంది.
- 'ఇంత మొగము చేసు కొన్నాడు.' 'ఇంత తింటాడు,' వీనిలో ఆ యింత తోపాటు చేయితో పరిమాణం చూపే వారు కావచ్చును. అందుకే ఆ యింత ఒకప్పుడు వైశాల్యాన్నీ, ఆధిక్యాన్నీ. మరొకప్ప్పుడు తద్విరుద్ధ రూపాన్నీ తెల్పుతుంది.
ఇంతలేసి
- "ఋషుల పాలింటనే యింతలేసి పనులు." కాశీ. 2. 104.
- "తలపం గూడునె యింతలేసి దొరలన్ దైన్యంబు..." భార. ఉద్యో. 2. 302.
- చూ. ఇం తేసి.
ఇంత సేయు
- ఇంతవరకూ తెచ్చు. ఈస్థితికి తెచ్చు.
- "కుబేరు డేగె నద్దనుజుల నింత చేసిన విధాతకు గో డనబోవు చాడ్పునన్." ఉ. హరి. 1. 42.
ఇంతా అంతా
- ఇంతా అంతా, ఎం తని చెప్పగలము అను పలుకుబడిలో వలె-కొంచెము కాదు, అధికము అని చెప్పుటకు ఉపయోగిస్తారు.
- "ధన్యత్వము.... ఇంతంత యన నా వశంబె?" పండితా. ప్రథ. పురా. పుట. 272.
ఇంతింత గాని
- ఎక్కు వయిన, కొలదికి మీఱిన అనుట.
- "ఇంతింత గాని తమి." సారం. 2. 39.
ఇంతిం తన రాక
- అపరిమితముగా, ఇంత అంత అని చెప్ప లేనంత.
- "అంతంతకు వైరాగ్యం, బింతిం తన రాక యెలమి నిగురొత్త." విప్ర. 1.83.
ఇంతింత యగు
- కొంతకొంత క్రమక్రమంగా పెరుగు.
- "ఇంతిం తై వటు డింత యై." భాగ.
ఇంతింతలు
- మిక్కిలి చిన్నవి, స్వల్పములు.
- "ఇంతింతలు దునియలు సేసె." భార. విరా. 5. 153.
- "నా తపము పెంపుల్ సూడ నింతింతలే..." ప్రబోధ. 2. 22.
ఇంతింతవారలు
- గొప్పవారు.
- ఇంతలేసి పనులు, ఇంతలు కన్నులు - మొద. వానిలో వలె హస్తాది విక్రియలతో ఇంతంతవా రనుటలో వచ్చినది.