పుట:PadabhamdhaParijathamu.djvu/170

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇంత_____ఇంత 144 ఇంత_____ఇంత

నెఱుగుదును. నా కింతమాత్రం తెలియదా?" వా. ఇంతమాత్రమె కాదు

 • ఇంతే కాదు...
 • ఏవైనా గుణాలను వర్ణించేటప్పుడు, మరికొన్ని చెప్పవలసినచోట యీ పలుకుబడిని ఉపయోగిస్తారు.
 • "ఇంతమాత్రంబె కాదు శ్రీమంతుడును నితాంతశుభవంతు డగువసుమంతు డలర." శుక. 1. 178.
 • "అతడు ధనవంతుడు, విద్యావంతుడు, ఇంతే కాదు. ఉదారుడు." వా.

ఇంతమొగము చేసుకొను

 • చిన్నబుచ్చుకొను.
 • "రాగానే అతను లేచిపోయేసరికి తాను ఇంత మొగం చేసుకున్నాడు."

ఇంత యం తనగ రాని

 • ఎంతో చెప్ప వీలు లేని ; అత్యధిక మైన.
 • "అంత నయ్యింతి యింత యం తనగ రాని, వంత దన యంతిపురి జేరి కంతునిశిత..." శుక. 1. 236.

ఇంత యింతగా కోసినా పాపం లేదు

 • ఎంత ఆఇక్ష కైనా తగు నను పట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "కోసిన నేమి పాప మగు గోమలి నాలుక యింత యింతగా." పారి. 4. 12.

ఇంతలింతలు

 • చిన్న చిన్న
 • "ఇంతలింతలు తునియ లై." ఉద్యో. 3. 117.

ఇంతవట్టు

 • 1. ఇంతమాత్రము.
 • "ఇంతవట్టు తగ జేయుము." భార. ఆర. 4. 387.
 • "ఇంతవట్టు నిజంబు." భార. ఉద్యో. 2. 302.
 • వాడుకలో ఇంతమాత్రం అని వినిపిస్తుంది.
 • "నువ్వు అది అంతా చేయ నక్కఱ లేదు. ఇంతమాత్రం చేస్తే చాలు." వా.
 • "వాడు చెప్పిందంతా యేమో కానీ ఇంతమాత్రం నిజం. వాడు ఆ ఊరు వెళ్ళి వచ్చాడు." వా.
 • 2. ఇంతవఱకు - ఇంతకాలం.
 • "ఇట్టి నీవు సుట్టమ వై యింతవట్టు, వారిలో నున్న వాడవు వారిజాక్ష!" హరి. పూ. 7 ఆ. 233 ప.
 • చూ. ఇంతమాత్రము.

ఇంతవార మనుకొను

 • గర్వించు.
 • "తరుణీ యేరికి జెల్లునె, యరయగ నే మింతవార మనుకొన నిదిగో..." కళా. 1. 179.
 • "మే మింతవార మని మిడిసిపడడం యేమంత మంచిది కా దమ్మా! కోడలా!" వా.

ఇంతలు కన్నులు

 • ఇంత విశాలము లయిన కన్నులు.
 • "ఇంతలు కన్ను లుండ దెరు వెవ్వరి వేడెదు భూసురేంద్ర!" మను. 2. 41.