ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆల_____ఆల 129 ఆల_____ఆలి
హఠాత్తుగా ఆయనభార్య చనిపోయిందట. అంతా ఆలగోడూ బాలగోడుగా ఉంది." వా. ఆలనా పాలనా లేదు
- చూచేవా రెవరూ లే రనుట.
- "ఆతోట ఆలనా పాలనా లేక పాడయి పోయింది." వా.
ఆపపాడి
- పాలిచ్చు ఆవులకలిమి.
- మేకపాడి వంటిది. పాండు. 2. 111.
ఆల బేల
- అమాయకురాలు. జం.
- "ఆలపు బేలపు కడు గొమరాలవు..." కుమా.
ఆలము చేయు
- ఉపేక్ష చేయు.
- "అని పలుకు నమ్మరాళలోలనయన పలుకు లాలంబు సేసి చక్రవాకి యిట్లనియె." మను. 6. 68.
ఆలము సేయు
- వ్యర్థపఱచు, గాయపఱచు.
- "కూర్మి యెల్ల నే డాలము సేసి." కుమా. 11. 55.
ఆలవట్ట మిడు
- గుడ్డతో గుండ్రముగా కూర్చిన విసనకఱ్ఱతో వీచు. ఇప్పటికీ దేవాలయాలలో దేవునిముందు ఊరేగింపులలో పట్టుకొని పోతారు. వీని పిడికఱ్ఱ చాలా పొడవుగా ఉంటుంది.
- "మృగాక్షు లాలవట్టంబు లిడ." భార. స్త్రీ. 2. 38.
ఆలవట్టము
- వస్త్రంతో గుండ్రంగా తయారుచేసిన విసనకఱ్ఱ; ఆలయోత్సవాలలో, రాజోపచారాలలో ఉపయోగించే గుడ్డ గొడుగు.
- "ఆలవట్టములు జామరులు...."
- పండితా. ప్రథ. వాద. పుట. 518.
- "మృగాక్షు లాలవట్టంబు లిడ..." భార. స్త్రీ. 2. 38.
- "కమలదళము మృణాళకాండమున జెర్చి, యాలవట్టంబు గావించి లీల మెఱయ, విసరు-" నిర్వ. 8. 62.
- "అచ్చరవిరిజోడు లాలవట్టము లూన, విను టెంకిచెలులు వీవనలు వైవ." అచ్చ. సుంద. 35.
ఆలించి విను
- శ్రద్ధగా విను, సావధానంగా విను.
- "రతిరోదనధ్వని వసంతకు చెవులం జిలికిన నులికిపడి యద్దెస యాలించి విని." కుమా. 5. 87.
ఆలిగొను
- పరిహసించు.
- "అకట! సైరంధ్రి నన్ను నిట్లాలి గొనగ, నేల." భార. విరా. 4. 18.
- చూ. ఆలిబుచ్చు.
ఆలిబుచ్చు
- పరిహసించు.
- చూ. ఆలిగొను.